వాట్సాప్‌ నుంచి కొత్త వాయిస్‌ ఫీచర్‌

ABN , First Publish Date - 2021-12-18T05:30:00+05:30 IST

వాట్సాప్‌ వాయిస్‌ మెసేజ్‌ ప్రివ్యూ ఫీచర్‌ను విడుదల చేసింది. దీంతో తాము రికార్డు చేసిన వాయిస్‌ మెసేజ్‌ను....

వాట్సాప్‌ నుంచి కొత్త వాయిస్‌ ఫీచర్‌

వాట్సాప్‌ వాయిస్‌ మెసేజ్‌ ప్రివ్యూ ఫీచర్‌ను విడుదల చేసింది. దీంతో  తాము రికార్డు చేసిన వాయిస్‌ మెసేజ్‌ను పంపుకొనే లేదంటే ఆపుకొనే వెసులుబాటు వినియోగదారుడికి ఉంటుంది. అసలు రికార్డింగ్‌ బాగా ఉందో లేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంది. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే...


 వాట్సాప్‌ వినియోగదారులకు ఇంతకాలం రికార్డు చేసిన మెసేజ్‌లను నిలిపివేసే లేదంటే పంపడానికి ముందు ఒకసారి వినే అవకాశం లేదు. ఇప్పుడు ఆ రెండూ చేయవచ్చు. పంపకూడదు అనుకుంటే నిక్షేపంగా ఆ వాయిస్‌ మెసేజ్‌ను డిలీట్‌ కూడా చేయవచ్చు. 


 వ్యక్తిగత, గ్రూప్‌ చాట్‌ రెంటిలోనూ ఈ ప్రివ్యూ ఫీచర్‌ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌, డెస్క్‌టా్‌ప(వాట్సాప్‌ వెబ్‌).... అన్నిటా ఇది పనిచేస్తుంది.

 నిడివి ఎక్కువ ఉన్న మెసేజ్‌లను పంపుకోవాలంటే ఇలా చేయాలి.    

వ్యక్తిగత లేదంటే గ్రూప్‌ చాట్‌ను ఓపెన్‌ చేయాలి. మైక్రోఫోన్‌ను టచ్‌ చేసి,  ఫ్రీ రికార్డింగ్‌ కోసం లాక్‌ హ్యాండ్‌ వరకు స్లయిడప్‌ చేయాలి. దానిపై ఉంచిన వేలు తీసేసి ఇక ఫ్రీగా రికార్డింగ్‌ చేసుకోవచ్చు. రికార్డింగ్‌ పూర్తయిన తరవాత సెండ్‌ బటన్‌ కొట్టేయవచ్చు. 

- రికార్డు అయిన మెసేజ్‌ను ప్రివ్యూ చేసుకోవాలంటే, వ్యక్తిగత లేదంటే గ్రూప్‌ చాట్‌ను ఓపెన్‌ చేయాలి.  మైక్రోఫోన్‌ను టచ్‌ చేసి,  ఫ్రీ రికార్డింగ్‌ కోసం లాక్‌ హ్యాండ్‌ వరకు స్లయిడప్‌ చేయాలి. మాట్లాడటం పూర్తయిన తరవాత స్టాప్‌పై టాప్‌ చేయాలి. రికార్డు చేసింది వినడానికి ప్లేని టాప్‌ చేస్తే సరిపోతుంది.

- టైమ్‌స్టాంప్‌ నుంచి రికార్డింగ్‌ చేసిన దాంట్లో ఏ పార్ట్‌ అయినా వినవచ్చు.

- రికార్డు చేసిన వాయిస్‌ మెసేజ్‌ని డిలీట్‌ చేసే అవకాశం కూడా ఉంటుంది. టాప్‌ చేసి ట్రాష్‌లోకి పంపి డిలీట్‌ చేయవచ్చు. 

- మెసేజ్‌ వినే సమయంలో వేగాన్ని పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. 1ఎక్స్‌, 1.5 ఎక్స్‌, 2 ఎక్స్‌ వరకు పెంచుకోవచ్చు.

Updated Date - 2021-12-18T05:30:00+05:30 IST