పెట్రోలును ఫ్రిజ్‌లో పెడితే గడ్డ కడుతుందా? సమాధానమిదే..

ABN , First Publish Date - 2022-03-19T14:42:51+05:30 IST

ఏదైనా ద్రవ పదార్థాన్ని ఫ్రీజర్‌లో ఉంచినట్లయితే...

పెట్రోలును ఫ్రిజ్‌లో పెడితే గడ్డ కడుతుందా? సమాధానమిదే..

ఏదైనా ద్రవ పదార్థాన్ని ఫ్రీజర్‌లో ఉంచినట్లయితే కొంతసేపటి తర్వాత అది గడ్డకడుతుంది. అయితే ఫ్రిజ్‌లో పెట్రోలు పెడితే ఏమవుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? పెట్రోల్ ఐస్‌గా  మారుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. దీనికిముందు మంచు ఎలా గడ్డకడుతుందో తెలుసుకోవాలి. ఏదైనా ద్రవ పదార్థాన్ని దాని ఘనీభవన స్థానం వరకు అంటే కనిష్ట ఉష్ణోగ్రత స్థితికి తీసుకువస్తే, అది గడ్డకడుతుంది. అయితే అన్ని రకాల ద్రవాల ఘనీభవన స్థానం ఒకేలా ఉండదు. కొంత భిన్నంగా ఉంటుంది. 


ఘనీభవన స్థానం అంటే ఒక స్థాయి ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత, ఆ పదార్ధం గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఏదైనా ద్రవం పదార్థ ఘనీభవన స్థానం దానిలోని మూలకాలపై ఆధారపడి ఉంటుంది. నీరు, పాలు, ఎడిబుల్ ఆయిల్, క్రూడ్ ఆయిల్ ఇలా అన్నింటికీ భిన్నమైన ఫార్ములాలు ఉంటాయి. వాటి మరిగే లేదా ఘనీభవన స్థానం భిన్నంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 0 ° Cకి చేరుకున్నప్పుడు  నీరు మంచుగా మారుతుంది. ఇక పెట్రోల్ విషయానికొస్తే పెట్రోల్ ఫార్ములా CnH2n+2. ఇది ప్రధానంగా కార్బన్, హైడ్రోజన్ సమ్మేళనం. దీని ఘనీభవన స్థానం నీటి కంటే చాలా తక్కువగా ఉంటుంది. పెట్రోల్ ఘనీభవన స్థానం మైనస్ అరవై (-60) డిగ్రీల సెల్సియస్. అంటే పెట్రోల్‌ను -60 డిగ్రీలకు తీసుకువస్తే అది గడ్డకడుతుంది. అయితే విశేషమేమిటంటే ఏ కంపెనీ కూడా ఇప్పటి వరకూ అలాంటి ఫ్రీజర్‌ను తయారు చేయలేదు. మన ఇంట్లో ఉండే ఫ్రీజర్‌లలో ఫ్రీజర్ కనిష్ట ఉష్ణోగ్రత 0 నుండి -4 వరకు మాత్రమే ఉంటుంది. అటువంటి పరిస్థితిలో మన ఇంట్లోని ఫ్రీజర్‌లో పెట్రోల్ ఉంచితే గడ్డ కట్టడు. దానికి ప్రత్యేకమైన ఫ్రీజ్ అవసరం.

Updated Date - 2022-03-19T14:42:51+05:30 IST