ఉద్యోగం ఇప్పిస్తామని మహిళలను తీసుకెళ్లారు.. గదిలో బంధించి అశ్లీలంగా నృత్యం చేయమంటూ..

ABN , First Publish Date - 2022-04-25T03:43:03+05:30 IST

ఉద్యోగాల పేరుతో రకరకాల మోసాలు చేయడం చూస్తుంటాం. అవసరాన్ని అవకాశంగా తీసుకుని చివరకు డబ్బు రూపంలో మోసం చేయడమో.. లేదా అత్యాచారాలకు పాల్పడడమో చేస్తుంటారు...

ఉద్యోగం ఇప్పిస్తామని మహిళలను తీసుకెళ్లారు.. గదిలో బంధించి అశ్లీలంగా నృత్యం చేయమంటూ..
ప్రతీకాత్మక చిత్రం

ఉద్యోగాల పేరుతో రకరకాల మోసాలు చేయడం చూస్తుంటాం. అవసరాన్ని అవకాశంగా తీసుకుని చివరకు డబ్బు రూపంలో మోసం చేయడమో.. లేదా అత్యాచారాలకు పాల్పడడమో చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. బీహార్‌లో తాజాగా జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఉద్యోగం ఇప్పిస్తామని మహిళలను తీసుకెళ్లారు. గదిలో బంధించి అశ్లీలంగా నృత్యం చేయమంటూ వేధించారు. చివరకు ఏమైందంటే..


మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన షాని సోంధియా, నిధి సోంధియా, పింటూ కుమార్ కలిసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకునేవారు. ఈ క్రమంలో స్థానిక ప్రాంతానికి చెందిన ముగ్గురు మహిళలకు.. బీహార్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ నమ్మించారు. తర్వాత వారిని బీహార్‌కు తీసుకెళ్లి రామ్ సాగర్, లవకుష్ కుమార్‌కు అప్పగించారు. వారు మహిళలను తీసుకెళ్లి ఓ గదిలో బంధించారు. వివాహ వేడుకల్లో అశ్లీలంగా నృత్యం చేయాలంటూ బలవంతపెట్టారు.

పుట్టిన రోజు సందర్భంగా ప్రియురాలిని ఇంటికి పిలిచాడు.. ప్రత్యేకంగా మాట్లాడాలంటూ గదిలోకి తీసుకెళ్లి..


ఇందుకు వారు ససేమిరా అనడంతో వేధించడం మొదలెట్టారు. ఈ క్రమంలో జబల్‌పూర్ ఎస్పీకి మహిళలు ఫోన్ చేసి, తమకు జరిగిన అన్యాయం గురించి తెలియజేశారు. ఎస్పీ ఆదేశాలతో పోలీసులు బంధీగా ఉన్న ముగ్గురు మహిళలను రక్షించారు.   కేసు నమోదు చేసుకుని, షాని సోంధియా, నిధి సోంధియా, పింటూ కుమార్‌లను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న రామ్ సాగర్, లవకుష్ కుమార్‌ కోసం గాలిస్తున్నారు.

ప్రియుడి కోసం భర్తను దూరం పెట్టింది... నాకు చేసినట్లు మరెవరికీ చేయొద్దంటూ భార్యకు లేఖ రాసిన భర్త..

Updated Date - 2022-04-25T03:43:03+05:30 IST