మనం రోజూ చూసుకునే అద్దం ఎలా తయారవుతుందో తెలుసా?

ABN , First Publish Date - 2022-02-15T17:39:05+05:30 IST

గాజు మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో...

మనం రోజూ చూసుకునే అద్దం ఎలా తయారవుతుందో తెలుసా?

గాజు మన జీవితంలో ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలిసిందే. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలాసార్లు మనం అద్దం ముందుకు వెళుతుంటాం. అద్దం ముందుకు వెళ్లగానే దానిలో మన ప్రతిబింబంం కనిపిస్తుంది. ఇలా ఎందకు జరుగుతుందో?.. ఇంతకీ అద్దాన్ని ఎలా తయారు చేస్తారో మీకు తెలుసా? గ్లాస్ తయారీ విధానం.. అది ఫ్యాక్టరీలో ఎలా తయారవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. గాజులో అనేక రకాలున్నాయి. పాత్రలు, సీసాలు, కిటికీ అద్దాలు మొదలైన వాటి తయారీకి కూడా గాజును ఉపయోగిస్తారు. మనం ముఖం చూసుకునే అద్దాన్ని తయారు చేసేందుకు, పెద్ద గ్లాస్‌ని రోబోటిక్ సిస్టమ్ ద్వారా కన్వేయర్ బెల్ట్‌కు రవాణా చేస్తారు. 


 అక్కడ దానిని నీరు, ఆక్సైడ్ మొదలైన వాటితో శుభ్రం చేస్తారు. అలాగే దానిని శుభ్రం చేయడానికి వేడి నీటిని కూడా ఉపయోగిస్తారు. అప్పుడు గాజుకు పూత పూస్తారు. మొదట ద్రవీకృత టిన్ పూత పూస్తారు. ఇందులో కొన్ని రసాయనాలు కూడా మిళితం అవుతాయి. దీని కారణంగా సాధారణ గాజు అద్దంగా మారుతుంది. దీని తరువాత దానిపై డబుల్ కోటింగ్ చేస్తారు. ఈ కారణంగా గాజు చాలా కాలం పాటు ఉంటుంది. అనంతరం దానికి 31 °C ఉష్ణోగ్రత వద్ద ఉంచుతారు. అప్పుడు వెనుకవైపు పెయింట్ వేసి యంత్రాల ద్వారా ఎండబెడతారు. చాలా కంపెనీలు డబుల్ కోటింగ్ కూడా చేస్తాయి. దీని తర్వాత డిమాండ్‌కు తగ్గట్టుగా కట్ చేస్తారు. దీనిలో అనేక రకాల డిజైన్‌లు కూడా ఉంటాయి. గాజు ఇసుకతో తయారు చేస్తారు. ఇసుకతోపాటు కొన్ని ఇతర పదార్థాలను 1500 డిగ్రీల సెల్సియస్ వద్ద కొలిమిలో కరిగించి, ఆపై ఈ కరిగిన గాజును కావాల్సిన విధంగా మలుస్తారు. ఈజిప్ట్, మెసొపొటేమియాలో క్రీ.పూ రెండున్నర వేల సంవత్సరాలలోనే గాజును కనుగొన్నారు. మొదట్లో ఇది అలంకరణ కోసమే ఉపయోగించేవారు. తరువాతి కాలంలో గాజు పాత్రల తయారీ ప్రారంభమైంది.


Updated Date - 2022-02-15T17:39:05+05:30 IST