Advertisement
Advertisement
Abn logo
Advertisement

తర్జుజ పండు వల్ల ఉపయోగలేమిటి?

ఆంధ్రజ్యోతి(01-01-2021)

ప్రశ్న: తర్బుజా పండు మంచిదేనా, దీనివల్ల లభించే పోషకాల గురించి తెలియజేయండి. 


- గౌరి, వరంగల్‌


డాక్టర్ సమాధానం: బంగారు రంగులో, తీయగా ఉండే తర్బుజా పండ్లలో పోషకాలు ఎక్కువే. తక్కువ కెలోరీలతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారాల్లో తర్బుజా ఒకటి. రెండువందల గ్రాముల తర్బుజా పండులో కేవలం డెబ్బై కెలోరీలు మాత్రమే ఉంటాయి. కానీ ఓ రోజుకు మన శరీరానికి కావాల్సిన విటమిన్‌ - సి మొత్తం ఇందులో లభిస్తుంది. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమైన విటమిన్‌ - ఎ ఇందులో ఎక్కువే. జీర్ణవ్యవస్థ పనితీరును కాపాడే పీచు పదార్థం కూడా ఈ పండులో ఉంది. తర్బుజాలో నీటిశాతం ఎక్కువ. అందుకే కొంచెం తినగానే కడుపు నిండినట్టు అనిపిస్తుంది. ఎక్కువ కెలోరీలున్న ఆహారం స్థానంలో తర్బుజా పండును తీసుకుంటే బరువు తగ్గేందుకు ఉపయోగ పడుతుంది. శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించేందుకు కూడా తర్భుజా ఉపయోగపడుతుంది. దీనిని జ్యూస్‌లా కంటే పండుగా తీసుకోవడమే మేలు. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

[email protected] కు పంపవచ్చు)


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement