రోజూ వంటల్లో వాడే టొమాటోలో ఏయే పోషక విలువలు ఉంటాయో తెలిస్తే..?

ABN , First Publish Date - 2022-04-15T19:28:37+05:30 IST

టొమాటో లేకపోతే వంట చేయలేని పరిస్థితి మన తెలుగు ఇళ్లల్లో. ఈ ఎర్రని టొమాటోలో ఏయే పోషకవిలువలు ఉంటాయో తెలియజేయండి.

రోజూ వంటల్లో వాడే టొమాటోలో ఏయే పోషక విలువలు ఉంటాయో తెలిస్తే..?

ఆంధ్రజ్యోతి(15-04-2022)

ప్రశ్న: టొమాటో లేకపోతే వంట చేయలేని పరిస్థితి మన తెలుగు ఇళ్లల్లో. ఈ ఎర్రని టొమాటోలో ఏయే పోషకవిలువలు ఉంటాయో తెలియజేయండి.


- సుచరిత, చెన్నై 


డాక్టర్ సమాధానం: అన్ని రకాల వంటల్లోను విరివిగా వాడే టొమాటో పోషకాల గని. వండినదే కాక పచ్చిగా సలాడ్ల రూపంలో తినడానికి కూడా అనువైనది. తాజా టొమాటోల్లో అధిక భాగం నీరే ఉంటుంది. పిండి పదార్థాలు తక్కువగా ఉండడం వల్ల కెలోరీలు కూడా తక్కువే. పీచు పదార్థం, విటమిన్‌ - సి, పొటాషియం, విటమిన్‌- కె, ఫోలేట్‌, బీటా కెరోటీన్‌ మొదలైనవి టొమాటోలో అధికంగా ఉన్నాయి. అందు వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచేందుకు, రోగనిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉండేందుకు టొమాటో ఉపయోగపడుతుంది. టొమాటోలో ఉండే లైకోపీన్‌, క్లోరినేర్గిక్‌ యాసిడ్‌ లాంటి యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి, క్యాన్సర్‌ ముప్పును తగ్గించేందుకు, చర్మం తాజాగా ఉండడానికి సహాయపడతాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా ఉండేందుకు కూడా ఆహారంలో టొమాటో భాగం చేసుకుంటే మంచిది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-04-15T19:28:37+05:30 IST