ఉద్యాన పంటలకు ప్రోత్సాహమేది?

ABN , First Publish Date - 2022-05-23T06:16:05+05:30 IST

ఉద్యాన పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, కంది పంటల సాగు చేయాలని సూచిస్తున్న ప్రభుత్వం ముఖ్యమైన ఉద్యాన పంటల సాగును మాత్రం ప్రోత్సహించడం లేదని రైతులు వాపోతున్నారు.

ఉద్యాన పంటలకు ప్రోత్సాహమేది?

కూరగాయలు, పండ్ల ఉత్పత్తి నామమాత్రమే 

65వేల ఎకరాలకు మించని సాగు 

ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ సాగుపైనే దృష్టి

పలు పథకాలకు నిధులను నిలిపిన ప్రభుత్వం


నల్లగొండ: ఉద్యాన పంటలకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి, కంది పంటల సాగు చేయాలని సూచిస్తున్న ప్రభుత్వం ముఖ్యమైన ఉద్యాన పంటల సాగును మాత్రం ప్రోత్సహించడం లేదని రైతులు వాపోతున్నారు. ఉద్యాన పంటల్లో కేవలం ఆయిల్‌పామ్‌ సాగు అదీ కూడా నల్లగొండ, సూర్యాపేట జిల్లాలపైనే ప్రభుత్వం దృష్టిసారించింది. అది కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం గమనార్హం.



ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు అనుకూలమైన వాతావరణం ఉన్నా ప్రభు త్వం పట్టించుకోవడం లేదు. గతంలో దేశంలోనే ఉమ్మ డి నల్లగొండ జిల్లా పండ్ల తోటల సాగులో ముందుండే ది. అయితే కరువు పరిస్థితులు, ప్రకృతి వైపరీత్యాలు, తెగుళ్ల కారణంగా పండ్ల తోటలను తొలగించి రైతులు వరి, ఇతర పంటల సాగువైపు మళ్లారు. ఉద్యాన పం టపై రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో సం బంధిత శాఖ పట్టింపు లేకపోవడం, అదీగాక ఉద్యాన శాస్త్రవేత్తల సంఖ్య తక్కువగా ఉండడం, వ్యవసాయ అధికారులకు అవగాహన లేకపోవడం తదితర కారణాలతో ఉమ్మడి జిల్లాలో పండ్ల తోటల సాగు క్రమం గా తగ్గుతూ వచ్చింది.


కరువైన ప్రభుత్వ పథకాలు

ప్రభుత్వం ఉద్యాన పంటలను సాగుకు సంబంధించిన పథకాలను అమలుచేయడంలేదు. ఇప్పటికే డ్రిప్‌ పథకాన్ని అటకెక్కించింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12వేల నుంచి 15వేల మంది రైతులు డ్రిప్‌ పథకానికి దరఖాస్తు చేసుకోగా, ప్రభుత్వం మంజూరు చేయలేదు. నీటి వనరులను ఆధారంగా చేసుకుని పండ్ల తోటలు, కూరగాయల సాగుకు డ్రిప్‌ లేకపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం నుంచి సబ్సిడీ లేకపోవడంతో డ్రిప్‌ పథకం నిలిచింది. రైతులకు సబ్సిడీపై డ్రిప్‌ అందజేస్తే తక్కువ నీటితో ఎక్కువ మొత్తంలో కూరగాలు, పండ్ల తోటలు సాగ య్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం ఆయిల్‌పామ్‌ సాగును మాత్రమే ప్రోత్సాహిస్తూ ఉద్యా న పంటలను పక్కన పెట్టింది. బత్తాయి, మామిడి తోటల సాగుకు రైతులు ముందుకొస్తున్నా, ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది.  ఉద్యాన పంటల సాగుకు చేసే రైతులకు ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని మిన హా ఇతర ప్రోత్సాహకాలను, సబ్సిడీలను పూర్తిగా నిలిపివేసింది. రైతుబంధు పథకానికి ముందు డ్రిప్‌ పథకానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సుమారు రూ.30 కోట్ల వరకు నిధుల కేటాయింపు ఉండేది. ప్రస్తుతం ఆ నిధుల కేటాయింపు నిలిచిపోయింది. దాదాపు ఏడేళ్లుగా డ్రిప్‌ పథకం అమలుకు నోచుకోవడం లేదు. గత ఏడాది మాత్రం అరకొరగా కేటాయింపులు చేసి ఆ తరువాత నిలిపివేశారు. రెండేళ్ల క్రితం పాలీహౌ్‌సలు, క్రాప్‌కాలనీలు, కూరగాయలు గ్రీన్‌హౌ్‌స పేరుతో ప్రభుత్వం హడావుడి చేసి సబ్సిడీ ఇచ్చినా, ప్రస్తుతం పూర్తిగా నిధులను నిలిపివేసింది.


ఉమ్మడి జిల్లాలో 65వేల ఎకరాలే..

ఉమ్మడి జిల్లాలో గతంలో దేశంలో ఎక్కడా లేని విధంగా 3.50లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు ఉండేవి. ప్రస్తుతం బత్తాయి, మామిడి, జామ ఇతర పండ్ల తోటల సాగు 65వేల ఎకరాలకు మించి లేదు. పూల తోటలు, సెరీకల్చర్‌ లాంటి పంటల సాగు లేనేలేదు. రానురానూ బత్తాయి, మామిడి ఉత్పత్తులు కూడా పడిపోయే పరిస్థితి నెలకొంది. దీంతో పండ్లు, కూరగాయలు, పూలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. కూరగాయల సాగును ప్రోత్సాహిస్తామని చెప్పిన ప్రభుత్వం దానిపై కూడా దృష్టిసారించడం లేదు. హైదరాబాద్‌ సమీపంలో ఉన్న నల్లగొండ, యాదాద్రి జిల్లాలోని కొన్ని మండలాల్లో కూరగాయల సాగును ప్రోత్సాహిస్తామని ప్రభుత్వం చెప్పినా, ఆ వైపుగా ప్రణాళికలు రూపొందించలేదు. ఉమ్మడి జిల్లాలో కూరగాయల సాగు లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటుండటంతో ప్రజలపై ధరల భారం పడుతోంది. ఇటీవల కరోనా సమయంలో బత్తాయి సాగుచేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉత్పత్తులను ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ వంటి రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రకు ఎగుమతి కాకపోవడంతో రైతులు నష్టాలకు గురయ్యారు. బత్తాయి తోటలు చాలా చోట్ల కాల్వల వెంట, నీట వనరులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో సాగుచేయడంతో పంటలు జాలుపట్టి దెబ్బతింటున్నాయి.


మార్గదర్శకాలొస్తే అమలు చేస్తాం : సంగీతలక్ష్మీ, నల్లగొండ జిల్లా ఉద్యానశాఖ అధికారి

ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వస్తే ఉద్యాన పంటల సాగుపై రైతులను ప్రోత్సాహించడమేగాక ప్రభుత్వ పథకాలను అమలుచేస్తాం. ప్రస్తుతం ఆయిల్‌పామ్‌ సాగుపై ప్రభుత్వ ఆదేశాల మేరకు దృష్టిసారించాం. ఆయిల్‌పామ్‌ సాగుకు రైతులు ముందుకువస్తున్నారు. ఇతర పంటల సాగుపై కూడా రైతులకు హార్టికల్చర్‌ అధికారులు అందుబాటులో ఉంటూ సూచనలు, సలహాలు అందజేస్తున్నారు.


Updated Date - 2022-05-23T06:16:05+05:30 IST