పూర్తి సమాచారం లేకుంటే ఎలా?

ABN , First Publish Date - 2022-07-02T05:09:54+05:30 IST

వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించేందుకు భూములు, ఇతర పరిహారాల జాబితా మీ వద్ద లేకుంటే ఎలా వివరాలు సేకరిస్తారని జేసీ విజయసునీత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో భూసేకరణ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోవడంతో అసహ నం వ్యక్తం చేశారు.

పూర్తి సమాచారం లేకుంటే ఎలా?

అధికారులపై జేసీ విజయసునీత ఆగ్రహం

హిరమండలం, జూలై 1: వంశధార నిర్వాసితులకు అదనపు పరిహారం చెల్లించేందుకు భూములు, ఇతర పరిహారాల జాబితా మీ వద్ద లేకుంటే ఎలా వివరాలు సేకరిస్తారని జేసీ విజయసునీత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండల పరిషత్‌ కార్యాలయంలో భూసేకరణ అధికారులు, రెవెన్యూ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాసితులకు సంబంధించి పూర్తి సమాచారం లేకపోవడంతో అసహ నం వ్యక్తం చేశారు. నిర్వాసితుల వివరాలు పక్కాగా ఉండాలన్నారు. పూర్తి సమాచారం లేకుంటే పరిహారం ఎలా అందిస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు చెల్లింపులు చేసిన జాబితా, పెండింగ్‌ జాబితాను తహసీల్దార్‌ కార్యాలయానికి పంపినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది నిర్వాసితులు జేసీని కలిసి జాబితాల్లో పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క నిర్వాసితునికి న్యాయం చేయడం జరుగుతుందని జేసీ హమీ ఇచ్చారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో  జయరాం, ఎస్‌డీసీ జయదేవి, తహసీల్దార్‌ సత్య నారాయణ పాల్గొన్నారు.

 

Updated Date - 2022-07-02T05:09:54+05:30 IST