Raw Milk: పచ్చి పాలు తాగడం మంచిదేనా..? కాగబెట్టకుండా పాలను తాగితే ఏమవుతుందంటే..

ABN , First Publish Date - 2022-07-27T21:04:21+05:30 IST

పచ్చి పాలు గడ్డి తినే ఆవుల నుండి వస్తాయి కాబట్టి, ఆ పాల నాణ్యత పూర్తిగా ఆవు ఆహారం, ఎక్కడ పెరుగుతుంది., పాలను సేకరించే విధానంపై ఆధారపడి ఉంటుంది.

Raw Milk: పచ్చి పాలు తాగడం మంచిదేనా..? కాగబెట్టకుండా పాలను తాగితే ఏమవుతుందంటే..

పచ్చి పాలను తాగడం అనేది పల్లెల్లో మామూలు విషయమే.. అప్పుడే పిండిన గుమ్మ పాలను పిల్లలకు పడుతూ ఉంటాం. అవి ఆరోగ్యానికి చాలా మంచిదని పెద్దలు చెపుతూ ఉంటారు. ఇక పట్టణాల్లో పాలను ప్యాకెట్స్ రూపంలో తీసుకుంటూ ఉంటాం. వీటిని కాచి తాగుతాం. అసలు పచ్చిపాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా లేదా కీడు చేస్తాయా అనేది తెలుసుకోవాలి. పచ్చిపాలతో ప్రయోజనాలు ఉన్నప్పటికీ, పాలను పచ్చిగా తీసుకోవడం వల్ల ప్రతికూలతలు కూడా ఉన్నాయంటున్నారు వైద్యులు.


పాలు ప్రోటీన్ శాతాన్ని అధికంగా కలిగి ఉంటాయి. వీటితో పాటు కాల్షియం, ఫాస్పరస్, బి విటమిన్లు, పొటాషియం విటమిన్ డి వంటి పోషకాలు సమృద్ధిగా ఉన్నాయి., ఈ పాలను అధికంగా తీసుకోవడం వల్ల ఎముకల వ్యాధి నివారణలో సహాయపడుతాయి. 


పచ్చి పాలు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు..

పచ్చి పాలలో పలు రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు ఉండే పాలను తాగితే కీళ్ల వాపు, డయేరియా, డీహైడ్రేషన్ వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. పాలు పితికే సమయంలో నీళ్లు, ఇతర పదార్థాలను కలుపుతారు. అంతేకాకుండా చుట్టూ వాతావరణాన్ని బట్టి కొన్ని మలినాలు కలుస్తాయి. అలాంటి పాలను నేరుగా తాగితే ఉదర సంబంధ ఇబ్బందులు తప్పవు. 


పచ్చి పాలు తీసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..

పచ్చి పాలు గడ్డి తినే ఆవుల నుండి వస్తాయి కాబట్టి, ఆ పాల నాణ్యత పూర్తిగా ఆవు ఆహారం, ఎక్కడ పెరుగుతుంది., పాలను సేకరించే విధానంపై ఆధారపడి ఉంటుంది. పచ్చి పాలలో ఎస్చెరిచియా కోలా, లిస్టేరియా, సాల్మోనెల్లా మొదలైన అనేక హానికరమైన బ్యాక్టీరియా ఉంటాయని.. ఇవి శరీరానికి హాని కలిగిస్తాయని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. పచ్చి పాలలో ఉండే బ్యాక్టీరియా విరేచనాలు, కీళ్లనొప్పులు, డీహైడ్రేషన్ వంటి సమస్యలను కలిగిస్తుందని పాలను వేడిచేసుకుని తాగడమే ఆరోగ్యానికి మంచిది. 


ఈ ఆహారం వల్ల కలిగే అనారోగ్యాలు చాలా వరకు ఫ్లూ వంటి లక్షణాలు కడుపు నొప్పి, వాంతులు వంటి జీర్ణశయాంతర సమస్యలకు కారణమవుతాయి. కొన్ని తీవ్రమైన ప్రతికూల ప్రభావాలలో పక్షవాతం  హేమోలిటిక్ యురేమిక్ సిండ్రోమ్ ఉన్నాయి, ఇది మూత్రపిండాల వైఫల్యానికి మరణానికి కూడా దారితీస్తుంది. గర్భిణీలు పాలిచ్చే తల్లులు, శిశువులు, వృద్ధులలో హెచ్‌ఐవి, క్యాన్సర్  ఆటో ఇమ్యూన్ సమస్యలు వస్తాయి. బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో మరిన్ని అనారోగ్యాలు కలిగే ప్రమాదం ఉంది.  

Updated Date - 2022-07-27T21:04:21+05:30 IST