Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుడ్డులోని పచ్చసొన తినడం వల్ల..

ఆంధ్రజ్యోతి(12-08-2020)

గుడ్డు తినాల్సిందేనా?

గుడ్డు గురించి పూర్తిగా తెలుసుకుంటే ఇలా ఎవరూ అడగరు. సంపూర్ణ పోషకాల నిలయం గుడ్డు. అయితే తెల్లసొన తిని, పచ్చసొనను పడేసే వాళ్లు చాలా మంది. అది తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. అందులో కొలెస్ట్రాల్‌ ఉండడమే అలా అనుకోవడానికి కారణం. అయితే పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ ఉన్నప్పటికీ దీన్ని తినడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరగడం లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.  అంతే కాదు పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువే ఉంటాయి. కాబట్టి తిన్నా బరువు పెరుగుతారన్న బెంగ లేదు. నిశ్చింతగా గుడ్డు మొత్తం తినొచ్చు. పచ్చసొనలో ఇనుము శాతం ఎక్కువ. దాన్ని మన శరీరం సులువుగా గ్రహిస్తుంది. గుడ్డులో ఉండే ల్యూటిన్‌ అనే యాంటీ ఆక్సిడెంటు కంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. పలు జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు గుడ్డులోని పోషకాలు సహకరిస్తాయి. రోజుకు ఒక గుడ్డు తినేవారిలో పక్షవాతం వచ్చే ముప్పు కూడా తక్కువ. 

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement