ఎదురు చూపులు

ABN , First Publish Date - 2021-04-13T05:18:42+05:30 IST

పంచాయతీ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటాయి.

ఎదురు చూపులు

పంచాయతీ ఎన్నికలకు రాని బిల్లులు 

ఆందోళన చెందుతున్న పంచాయతీ కార్యదర్శులు

ఏలూరు రూరల్‌, ఏప్రిల్‌ 12: పంచాయతీ ఎన్నికలు ముగిసి నెల రోజులు దాటాయి. తాజాగా పరిషత్‌ ఎన్నికలు ముగిశాయి. కార్యదర్శులకు బిల్లులు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఏలూరు రూరల్‌ మండలంలో 15 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటీవల ఫిబ్రవరిలో పం చాయతీ ఎన్నికలు, ఏప్రిల్‌ 8 పరిషత్‌ ఎన్నికలు జరిగాయి. రెండు ఎన్నికల నామినేషన్ల నాటి నుంచి పోలింగ్‌, కౌంటింగ్‌ వరకూ పంచాయతీ కార్యద ర్శులు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. నామినేషన్ల స్వీకరణ సమయంలో, పోలింగ్‌ సిబ్బందికి భోజనంతో పాటు టిఫిన్లు, మంచినీరు సౌకర్యాలు కల్పించారు. పోలింగ్‌ కేంద్రాల్లో పోలింగ్‌ సిబ్బందికి  విద్యుత్‌ సౌ కర్యం, జనరేటర్‌ వంటివి వాటిని ఏర్పాటు చేశారు. ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచిన ఇంతవరకూ ఆ బిల్లులు రాకపోవడంతో కార్యదర్శులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో పంచాయతీకి సుమారు రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకూ ఖర్చయితే కేవలం రూ.10 వేలు ఇచ్చి సరి పెట్టారు. మిగతా చెక్కులు ఇప్పటికి ఇవ్వకపోవడంతో లబోదిబోమంటు న్నారు. ఒక్కో పంచాయతీ కార్యదర్శి సరాసరిన రూ.50 నుంచి రూ.80 వేల వరకూ ఖర్చు చేశారు. భోజనాలు, టెంట్లు, జనరేటర్‌ వంటివి అప్పు తెచ్చి పెట్టారు. అయితే ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఎన్నికల కమీషన్‌ ఆదేశాలతో ఎంపీడీవో, డీపీవో అధికారులు పోలింగ్‌ కేంద్రాల వారీగా రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకూ మొదటి విడతలో చెక్కులు ఇచ్చారు. ఎ న్నికలు ముగిసిన తరువాత కూడా పంచాయతీలకు మరోసారి చెక్కులు ఇచ్చారు. ఈ విధంగా మండల పరిషత్‌ కార్యాలయాలకు చెక్కులు ఇచ్చినా పంచాయతీ కార్యదర్శులకు బిల్లులు చెల్లించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. తొలి విడతలో మంజూరు చేసిన నిధుల్లో పంచాయతీ కార్యదర్శులకు కొంత భాగం చెల్లించగా ఎక్కువ పంచాయతీల్లో ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. కొన్ని చోట్ల తమకు  ఇంకా నిధులు రాలేదని కార ణం చెబుతున్నారు. మండలాలకు కేటాయించిన నిధులకు సంబంధించి బిల్లులు వచ్చిన పరిస్థితి లేదు. ఎంత ఖర్చు చేశారు, ఎంత ఇచ్చారు అం దుకు సంబంధించిన బిల్లులు పంపితేనే బిల్లులు చెల్లించేందుకు అవకాశం ఉంది. అయితే డీపీవో కార్యాలయం నుంచి మండలాలకు ఆదేశాలు ఇచ్చినా అక్కడ నుంచి ఇంత వరకూ బిల్లులు చెల్లించలేదని తెలిసింది. 

Updated Date - 2021-04-13T05:18:42+05:30 IST