పుస్తకాలేవీ..

ABN , First Publish Date - 2022-09-19T04:54:01+05:30 IST

ప్రైవేటు పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు.

పుస్తకాలేవీ..

నేటికీ ప్రైవేటు పాఠశాలల్లో అందని ఎనిమిదో తరగతి పుస్తకాలు
గందరగోళంలో 2 వేల మందికి పైగా విద్యార్థులు
ప్రభుత్వ అస్తవ్యస్త విద్యావిధానంపై విమర్శలు

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబరు 18 : ప్రైవేటు పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులు గందరగోళంలో ఉన్నారు. జిల్లాలో సుమారు 5వేల మంది వరకు విద్యార్థులు ఎనిమిదో తరగతి చదువుతుండగా వారిలో సగం మంది వరకు ప్రభుత్వం అందించే పుస్తకాలు నేటికీ చేరలేదు. దసరా సెలవులు సమీపిస్తున్నాయంటే పావువంతు విద్యా సంవత్సరం పూర్తయినట్టే. కానీ పుస్తకాలే అందలేదంటే ఆ విద్యార్థుల పరిస్థితి ఏంటని ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు ప్రశ్నిస్తున్నాయి. తాడేపల్లిగూడెంలో 942 మంది ప్రైవేటు పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చవుతుండగా వారిలో 600 మంది విద్యార్థులకే నేటివరకు ఎనిమిదో తరగతి పుస్తకాలు అందాయి.  మరో 342 మంది విద్యార్థులకు పుస్తకాలు అందలేదు. పోని తర్వాత అయినా అందుతాయా.. అంటే జిల్లా పుస్తక పంపిణీ కేంద్రంలో తమ ఇండెంట్‌కు సరిపడా పుస్తకాలు పంపిణీ చేసేశామని ఎలాంటి ఇండెంట్‌ తాము పెట్టలేదని పుస్తక పంపిణీ కేంద్ర నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో విద్యార్థులకు ఈ ఏడాది ఎనిమిదో తరగతి పుస్తకాలు అందుతాయా అనే ప్రశ్నలు తలెత్తుతు న్నాయి. మిగతా తరగతులకు పుస్తకాలు రాగా చాలావరకు పంపిణీ జరిగింది.

అంతా గందరగోళమే..
ఎన్నో ఆశలతో బడికి వెళ్తున్న విద్యార్థులను ప్రభుత్వ వైఖరి ఆందోళనలోకి నెట్టింది. ప్రభుత్వమే ప్రైవేటు పాఠశాలలకు కూడా పుస్తకా లు అందిస్తుందనే నిబంధనే దీనికి కారణం. గతంలో ప్రైవేటు పాఠశాలలు వారికి కావాల్సిన పుస్తకాలను బుక్‌ స్టాల్స్‌, పబ్లిషర్స్‌ ఇలా ఎవరికి అవకాశం ఉన్న చోట వారు తెచ్చుకునేవారు, కానీ ప్రభుత్వం తామందించిన పుస్తకాలనే ప్రైవేటు పాఠశా లలకు ఇవ్వాలనే నిబంధనతో ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సంగతి ఎలా ఉన్నా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా ఎనిమిదో తరగతి పుస్తకాలు నేటికీ పాఠశాలకు చేరలేదు.

చదివేదెప్పుడు..
ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన పుస్తకాలకు సంబంధించిన డీడీని ఆయా పాఠ శాలలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో చెల్లించారు. కానీ దానికి సంబంధించిన వివరాలు పుస్తక పంపిణీ కేంద్రంలో లేవు. దీంతో వారికి ఎప్పుడు పుస్తకాలు అందుతాయి. ఎప్పుడు చదువుతారనే ఆందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.

Updated Date - 2022-09-19T04:54:01+05:30 IST