బార్‌లకు.. జీపీఎస్‌!

ABN , First Publish Date - 2022-09-16T05:28:02+05:30 IST

జిల్లాలో బార్‌లు ఉండే చోటు మారి పోయింది. కొత్త ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు.

బార్‌లకు.. జీపీఎస్‌!


ఖాతాదారులను ఆకర్షించేందుకు యజమానుల టెక్నాలజీ ఎత్తుగడ
 మొబైల్‌ ఫోన్‌లకు లింక్‌లు


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
 జిల్లాలో బార్‌లు ఉండే చోటు మారి పోయింది. కొత్త ప్రదేశాల్లో ఏర్పాటు చేశారు. నిత్యం ఒకే బార్‌కు వచ్చే ఖాతాదారులకు కొత్తచోట ఏర్పాటయ్యే బార్‌ల చిరునామా తెలిసే అవకాశం తక్కువగా ఉంటుంది. అందుకోసం జిల్లా వ్యాప్తంగా బార్‌ల యజ మానులు కొత్త ఎత్తుగడ వేస్తున్నారు. మారిన ప్రదేశా లతో జీపీఎస్‌ లింక్‌ చేసుకు న్నారు. పాత ఖాతా దారులకు సందేశాలు పంపుతున్నారు. గతంలో ఉండే బార్‌ స్థలం నుంచి కొత్తగా ఏర్పాటైన ప్రాంతానికి ఎలా చేరుకోవాలో జీపీఎస్‌ ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడులో 24 బార్‌లున్నా యి. ఇటీవల ఎక్సైజ్‌ శాఖ బార్‌లకు వేలంపాట నిర్వహిం చగా జిల్లాలో అన్ని బార్‌లలోనూ సిండికేట్‌ అయి బార్‌లు దక్కించుకున్నారు. అయితే కొన్ని బార్‌ లకు పాతచోట స్థానం లభించలేదు. భవన యజమానులు ఆసక్తి లేకపోవ డంతో లేదా వ్యాపారాలు అంతగా సాగకపోవడంతో బార్‌ యజమానులు కొత్త ప్రదేశా ల్లో ఏర్పాటు చేశారు. తాడేపల్లి గూడెంలో ఒక బార్‌కు ఇప్పటివరకు సరైన చోటు లభిం చలేదు. ఏదో ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు నిర్వాహ కులు ఆపసోపాలు పడు తున్నారు. మిగిలిన పట్టణాల్లో కొత్త ప్రాంతాల్లో బార్‌లను నెలకొల్పారు. ప్రభుత్వం నిబంధనల మేరకు పట్టణానికి మూడు కిలోమీటర్ల పరిధిలో  ఎక్కడైనా బార్‌ ఏర్పాటుకు అవకాశం ఉంది. ఆ దిశాగానే నిర్వాహకులు బార్‌లను ఏర్పాటు చేసు కున్నారు. గడచిన కొన్నేళ్లుగా ఒకే చోట బార్‌ ఉండడంతో ఖాతా దారులు అలవాటు పడ్డారు. ఈ ఏడాది స్థానచలనం కావడంతో పాత ఖాతాదారులు రాకపోవచ్చన్న అభిప్రాయం యజమానుల్లో ఏర్పడింది. దాంతో  జీపీఎస్‌ విధానాన్ని తెరపైకి తెచ్చారు. దీంతో కొత్తగా ఏర్పాటు చేసిన బార్‌లకు ఎలా చేరుకోవాలో అవకాశం కలిగింది. ఇలా పాత ఖాతాదారులను ఆకర్షించే పనిలో నిర్వాహకులు నిమగ్నమ య్యారు. మద్యం ప్రియుల సెల్‌ఫోన్‌లకు లింక్‌లు పంపుతున్నారు. వ్యాపారా లను నిలబెట్టుకోవడానికి యజమానులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకోవడం గమనార్హం.

Updated Date - 2022-09-16T05:28:02+05:30 IST