స్పందన అంతంతే.!

ABN , First Publish Date - 2022-09-10T06:32:49+05:30 IST

పాఠశాలల విలీనం అంటూ ప్రభుత్వం హడావిడి చేసింది.

స్పందన అంతంతే.!
యలమంచిలిలో జూనియర్‌ కళాశాల మంజూరైన ఉన్నత పాఠశాల

జిల్లాలో 16 ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు
ఆసక్తి చూపని విద్యార్థినులు .. రెండు కళాశాలల్లో జీరో ఆడ్మిషన్లు  


(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పాఠశాలల విలీనం అంటూ ప్రభుత్వం హడావిడి చేసింది. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఒకే విద్యా సంస్థలో చదువుకునే అవకాశం కల్పిస్తున్నామంటూ లెక్కకు మిక్కిలి గొప్పలు పలికింది. పైగా మహిళా విద్యకు పెద్దపీట వేస్తున్నా మంటూ ప్రకటనలు గప్పించింది. తీరా క్షేత్ర స్థాయిలో చతి కిలపడింది. జిల్లాలో 16 మహిళా జూనియర్‌ కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసింది. వీటిని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లోనే  ప్రారంభించారు. ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అడ్మిషన్లు నిర్వహించింది. విద్యార్థినుల నుంచి స్పందన లేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలోని పాల కోడేరు, యలమంచిలిలో ఒక్క విద్యార్థినీ చేరకపోవడం గమ నార్హం. ఇరగవరం, భీమవరం మండలంలోని దిరుసుమర్రు, అత్తిలి మండలంలోని ఆరవిల్లి  కళాశాలల్లో ఒక్కో విద్యార్థిని   అడ్మిషన్‌ తీసుకున్నారు. పెనుమంట్రలో ఇద్దరు, పెనుగొండ, పెంటపాడు కళాశాలల్లో ముగ్గురు వంతున చేరారు. 16 కళా శాలల్లో 180 మంది తొలి ఏడాది ఇంటర్‌లో ప్రవేశించారు. వీరందరికీ బోధించడానికి 54 మంది అధ్యాపక సిబ్బందిని నియమించారు. పాఠశాలలు విలీనం చేయడమే కాకుండా జూనియర్‌ కళాశాలల స్థాయికి పాఠశాల విద్యను విస్తరిం చాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఆదిలోనే పెద్ద అవరోధం ఏర్పడింది. తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మహిళా కళాశాలగా మార్చాలని ప్రభుత్వం తొలుత ప్రయ త్నించింది. తాడేపల్లిగూడెంలో మూడు దశాబ్దాల క్రితం ఏర్పా టైన జూనియర్‌ కళాశాలకు విద్యార్థుల నుంచి మంచి స్పంద న ఉంటోంది. ఈ ఏడాది నుంచి కేవలం విద్యార్థినులకే అవ కాశం కల్పించాలని చూడగా ఆడ్మిషన్‌లు పడిపోయాయి. ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి  ఎప్పటిలాగే విద్యార్థి, విద్యార్థినులకు అవకాశం కల్పించారు. కానీ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జూనియర్‌ కళా శాలల్లో మాత్రం స్పందన ఆశాజనకంగా లేదు. 

Updated Date - 2022-09-10T06:32:49+05:30 IST