Advertisement
Advertisement
Abn logo
Advertisement

ధరాఘాతం

 ఘాటెక్కిన ఉల్లి.. కేజీ రూ.50

 ఠారెత్తిస్తున్న టమోటాలు

 కన్నీరు పెట్టిస్తున్న కూరగాయలు 

 వర్షాలకు దెబ్బతిన్న పంటలు.. పెరిగిన ధరలు

ఏలూరు టూటౌన్‌, అక్టోబరు 22 : కూరగాయల ధరలు ఆకాశాన్నంటాయి. ఉల్లి పాయలు, టమోటాలు సామాన్యుడికి అందుబాటులో లేవు. గత పది రోజు ల క్రితం వరకూ కేజీ రూ.20–25 ఉన్న ఉల్లిపాయల ధరలు రూ.50లకు చేరుకు న్నాయి. టమోటాల పరిస్థితి కూడా అంతే. రూ.20లోపు ఉన్న టమోటాలు ఒక్క సారిగా రూ.50లకు చేరుకున్నాయి. వంకాయలు ధరలు అమాంతంగా పెరిగి పోయి కేజీ రూ.40 వరకు అమ్ముతున్నారు. చిక్కుడు కాయలు కేజీ రూ.70–80 వరకూ పలుకుతోంది. బీరకాయలు రూ.50 రూపాయలు పైమాటే. 

 కొన్నిరోజుల క్రితం వరకు రైతు బజారులో ఏ కూరగాయ అయినా  కేజీ రూ.20 లోపే ఉండేవి. బహిరంగ మార్కెట్లో ఇంకో రూ.పది అదనంగా అమ్మేవారు. ఇప్పుడు ఒకసారిగా రూ.40–50లకు చేరుకున్నాయి. అక్టోబరులో గులాబ్‌ తు ఫాన్‌ కారణంగా భారీ వర్షాలు కురవడం, ఆ తర్వాత కూడా వర్షాలు ముంచెత్తడంతో కూర గాయల పంటలు దెబ్బతిన్నాయి. అనంతరం కొత్త పంటలు వేశారు. ఈ పంటలన్నీ డిసెంబరులో అందుబాటులోకి వస్తాయి. అ ప్పటి వరకూ కూరగాయల ధరలు సామాన్యులకు అందు బాటులో ఉండే పరిస్థితులు కన బడడం లేదు. 

 మహారాష్ట్రలో భారీ వర్షాలు కారణంగా ఉల్లి పంట దెబ్బ తింది. ఫలితంగా ఉల్లి ఘాటెక్కింది. పెట్రోలు, డీజీల్‌ ధరలు పెరగ డం వల్ల రవాణా ఖర్చులు ఎక్కువయ్యాయి. కొత్త ఉల్లి వచ్చే సరికి డిసెంబరు, జనవరి మాసాలు వస్తాయి. క్యారెట్‌, బీట్‌రూట్‌, క్యాప్సికం హైదరాబాద్‌ నుంచి దిగుమతి అవుతాయి. అయితే హైదరాబాదు పరిసర ప్రాం తాలను  ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి. దీనితో పంటలు దెబ్బతిని వీటి ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో లేకుండా పో యాయి. నవంబరులో కార్తీక మాసం రాను న్న దృష్ట్యా కూరగాయలకు అధిక డిమాండ్‌ వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా ధరలు మరిం త పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ రెండు నెలలు ఈ ధరలను ప్రజ లు భరించాల్సిందేనని వ్యాపారులు పేర్కొంటున్నారు. 


 వచ్చే నెలలో తగ్గొచ్చు  

–  సుధాకర్‌, ఈవో, పత్తేబాద రైతు బజార్‌ 

కొత్త పంటలు నవంబరులో వచ్చే అవకాశం ఉంది. ధరలు తగ్గు ముఖం పట్టే అవకాశం ఉంది. గులాబ్‌ తుఫాన్‌, భారీ వర్షాలు కారణంగా కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. హైదరాబాదు, మహారాష్ట్రలో భారీ వర్షాలు కారణంగా ఉల్లిపాయ, టమోటాలు, ఇతర కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఉన్న పంటల్లో దిగు మతులు తగ్గిపోయాయి. దీనికారణంగా ధరలు పెరిగాయి.

Advertisement
Advertisement