గురుకుల పాఠశాల సందర్శన

ABN , First Publish Date - 2021-10-24T05:16:14+05:30 IST

వట్లూరు గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సెక్రటరీ విష్ణువర్థన్‌ శనివారం సం దర్శించారు.

గురుకుల పాఠశాల సందర్శన
వట్లూరు బాలయోగి గురుకుల పాఠశాలను సందర్శించిన బృందం సభ్యులు

పెదపాడు , అక్టోబరు 23: వట్లూరు గురుకుల పాఠశాలను సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సెక్రటరీ విష్ణువర్థన్‌ శనివారం సం దర్శించారు. జిల్లాలోని 12 గురుకుల విద్యాలయాల ప్రిన్సిపాళ్లతో సమావేశం అయ్యారు. ఆయా పాఠశాలల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వట్లూరులో జేవీకే కిట్ల పంపిణీ, తరగతి పాఠ్యపుస్తకాలు, నాడు – నేడు పనులను పరిశీ లించి సంతృప్తి వ్యక్తం చేశారని ప్రిన్సిపాల్‌ రత్నం తెలిపారు. అనంతరం విద్యా ర్థుల యోగ క్షేమాలు తెలుసుకుని, విద్యార్థులకు పెట్టే భోజన సదుపాయాలను పరిశీలించారు. ఐఐటీ విద్యా సంస్థల్లో ప్రవేశానికి 12 మంది అర్హత సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సోషల్‌ వెల్ఫేర్‌ జెడీ మధుసూదన రావు, ఎస్సీ కార్పొరేషన్‌ ఎండీ ఆర్‌.కుముదిని, జిల్లా ఇన్‌చార్జి డీసీవో పి.సుజాత పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-24T05:16:14+05:30 IST