Advertisement
Advertisement
Abn logo
Advertisement

వచ్చేది టీడీపీ ప్రభుత్వమే

ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడం శుభ పరిణామం 

జగన్‌ రెడ్డి అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ఆకివీడు ఎన్నికల ఫలితాల సమీక్షలో చంద్రబాబు పిలుపు

ఆకివీడు, డిసెంబరు 3 : ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్‌రెడ్డి అధికార దుర్వినియోగం, డబ్బు, అక్రమ కేసులతో అప్రజాస్వామికంగా గెలిచారు. ఆకి వీడు, కుప్పంలో టీడీపీ గెలిచేస్థాయిలో ఉన్నప్పటికీ ప్రత్యర్థి దుర్మార్గాలను ఎదుర్కొనే కొత్త నాయకత్వం లేకపోవడం వల్లే ఓటమి పాలయ్యాం. అధికార పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతోంది. మున్సిపల్‌ ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ ఓట్ల శాతం పెరిగింది. ఇది శుభపరిణామం. వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. ఇందులో మరో అనుమానం అక్కర్లేదు. నాయకులు అందరినీ కలుపుకుని వెళ్లాలి. సమర్థులైన అభ్యర్థుల ఎంపికతోపాటు వారు నిత్యం ప్రజ ల్లో ఉండేలా చూడాలి. వైసీపీ ఎంత బెదిరించినా క్షేత్రస్థాయిలో ప్రజా సమ స్యలపై పోరాటం చేయాలి’ అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఆకివీడు మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ఉండి నియోజకవర్గ నేతలతో శుక్రవారం అమరావతిలో జరిగిన సమీక్ష సమా వేశంలో మాట్లాడారు. గోదావరి జిల్లాల్లో అరాచకాలు సృష్టిస్తే ప్రజలు తీవ్రం గా వ్యతిరేకిస్తారన్నారు. ఓటీఎస్‌ పేరుతో పేదల నుంచి బలవంతంగా డబ్బు లు గుంజుతుండడంపై ప్రజలకు అండగా నిలవాలన్నారు. వైసీపీ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అని పిలుపునిచ్చారు. సమావేశంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్‌, మాజీ ఎమ్మె ల్యేలు గన్ని వీరాంజనేయులు, కలవపూడి శివ, బోండా ఉమా పాల్గొన్నారు. 

Advertisement
Advertisement