మరో బాదుడు

ABN , First Publish Date - 2022-07-01T06:23:36+05:30 IST

ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారాన్ని ప్రభుత్వం మోపింది.

మరో బాదుడు

ఆర్టీసీ ప్రయాణికులపై ఫ్యూయల్‌ సెస్‌ వడ్డన
దూర ప్రయాణం భారం.. నేటినుంచి అమలు
పల్లె వెలుగుల్లో 30 కి.మీ వరకు పెంపులే
దు


భీమవరం టౌన్‌, జూన్‌ 30 : ఆర్టీసీ ప్రయాణికులపై మరోసారి భారాన్ని ప్రభుత్వం మోపింది. ఫ్యూయల్‌ సెస్‌ పేరుతో అన్ని రకాల బస్సుల్లో కిలోమీటర్ల ఆధారంగా భారాన్ని పెంచారు. ఇటీవల ఆర్టీసీ బస్సు చార్జీల పెంపును మరువక ముందే మరోసారి ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సామాన్య ప్రజలపై ఇలా అదనపు భారాలు మోపడం దారుణమన్న విమర్శలు వస్తున్నాయి. పెరిగిన ఛార్జీలు శుక్రవారం నుంచే అమలులోకి రాను న్నాయి. ఇప్పటికే ఉన్నతాధికారులను నుంచి ఆదేశాలు రావడంతో  భీమ వరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం డిపోల్లో అధికారులు కస రత్తు చేపట్టారు. ఏ మేరకు ఛార్జీలు పెంపు అనేదానిపై  మాత్రం చెప్ప లేకపోతున్నారు. ఉన్నతాధికారులు పంపిన సర్క్యులర్‌లోని రేట్ల ఆధా రంగా ప్రస్తుతం కసరత్తు జరు గుతోంది. పల్లె వెలు గుకు సంబంధించి 30 కిలోమీటర్ల వర కు సెస్‌ పెంచ లే దు. ఆపై 35 నుంచి 60 కిలో మీటర్ల వరకు రూ.5, 65 నుంచి 70 కి.మీ వరకు రూ.10, 75 నుంచి 95 వరకు రూ.15,  100 నుం చి 120 వరకు రూ.20  చొప్పున పెంచారు. సుమారు 15 శాతం పెంచి నట్టు అంచనా.

జిల్లా కేంద్రమైన భీమవరం డిపో నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులపై ఎంత భారం పడనుందో కిలో మీటర్ల ఆధారంగా లెక్కలు కడు తున్నారు. ఇలా ఉండవచ్చని అంచనా..

ఊరుపేరు         పాత రేటు         కొత్త రేటు    కిలోమీటర్లు        పెరిగిన బారం
రాజమండ్రి     90 రూపాయిలు        105       93                15 రూపాయిలు
ఏలూరు         65                    75         65                10
నరసాపురం      35                   40           35               5
తాడేపల్లిగూడెం    35                 40           33                5
తణుకు            45                50           45                5
అమలాపురం       85               95            68             10 
విజయవాడ (ఎక్స్‌) 140            155          114            15 
విజయవాడ (ఆల్ర్టా) 165            190          114            25 
హైదరాబాద్‌         570           640          418            70
తిరుపతి            710            780          522            70 
విశాఖ             410            470          306            70

Updated Date - 2022-07-01T06:23:36+05:30 IST