నేటి నుంచి పాటిమ్మ తల్లి ఉత్సవాలు

ABN , First Publish Date - 2021-04-13T04:58:20+05:30 IST

చల్లచింతలపూడి శివారు పెరుగుగూడెంలో వెలసిన యల మర్తివారి ఆడపడుచు, గ్రామదేవత పాటిమ్మ అమ్మవారి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు పర్వతనేని ప్రభాకర్‌ తెలిపారు.

నేటి నుంచి పాటిమ్మ తల్లి ఉత్సవాలు
పాటిమ్మ తల్లి

దెందులూరు, ఏప్రిల్‌ 12: చల్లచింతలపూడి శివారు పెరుగుగూడెంలో వెలసిన యల మర్తివారి ఆడపడుచు, గ్రామదేవత పాటిమ్మ అమ్మవారి ఉత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్న ట్టు ఆలయ కమిటీ అధ్యక్షుడు పర్వతనేని ప్రభాకర్‌ తెలిపారు. ఐదు రోజుల పాటు ఈఉత్సవాలు జరుగు తాయన్నారు. పుట్టిల్లు అయిన ఉప్పలపాటి రామ మోహన్‌రావు ఇంటి నుంచి 101 కలశాలతో పాటిమ్మతల్లి గ్రామోత్సవం ప్రారంభ మవుతుం దని, పుట్టింటి నుంచి నూతన వస్ర్తాలు, నైవేద్యం సమర్పిస్తారన్నారు. తొలి పూజను సర్పం చ్‌ యలమర్తి రామకృష్ణ రేవతి, మాజీ సర్పంచ్‌ యలమర్తి హేమశ్రీనివాస్‌ దంపతులు పీటలపై కూర్చుని అమ్మ వారికి ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలు ప్రారంభిస్తారన్నారు.

Updated Date - 2021-04-13T04:58:20+05:30 IST