కప్పం కట్టాల్సిందే!

ABN , First Publish Date - 2022-09-06T06:06:39+05:30 IST

జిల్లాలోని ఓ ముఖ్య పట్టణంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత ధనదాహానికి అడ్డూ అదుపూ లేకపోతోందన్న విమర్శలు విన్పి స్తున్నాయి.

కప్పం కట్టాల్సిందే!
మాస్టర్‌ ప్లాన్‌ రహదారిపై వెలిసిన సిమెంట్‌ రహదారి (గతంలో ఇక్కడ ఇళ్లు ఉండేవి)

జిల్లాలో ఓ నేత ధన దాహం
మునిసిపల్‌  స్థలంలో రహదారి వేసేందుకు అనుమతి
రూ.1.50 కోట్లు ముట్టచెబితే ఓకే.. లేదంటే ప్రైవేటు స్థలానికి అడ్డుగా కంచె
అధికారులతో బెదిరింపులు
సొమ్ములు ముట్టాక కంచె మాయం
రహదారి ప్రత్యక్ష్యం.. ఓ పెద్దమనిషి జోక్యంతో సమసిన వివాదం
ప్రైవేటు స్థలంలోకి ఓ షాపింగ్‌ మాల్‌


జిల్లాలోని ఓ ముఖ్య పట్టణంలో అధికార పార్టీకి చెందిన ఓ నేత ధనదాహానికి అడ్డూ అదుపూ లేకపోతోందన్న విమర్శలు విన్పి స్తున్నాయి. అక్కడ ఏ పని చేయాలన్నా ఆ  నేత కు కప్పం చెల్లించాల్సిందే. లేదంటే అధికారు లను  రంగంలోకి దింపి నిర్మాణాలను ఆపే స్తారు.  ఆ పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ పక్కనే మున్సిపల్‌ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో ప్రైవేటు వ్యక్తులు రహదారి అభివృద్ధి చేసినందుకు ఏకంగా రూ.1.50 కోట్లు నేత జేబులోకి చేరాయి.
(భీమవరం–ఆంధ్రజ్యోతి):
పట్టణంలోని మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డులో ప్రైవేటు వ్యక్తులు రహదారి వేయాల్సిన అవసరం ఏమిటన్న అనుమానం రావడం సహజం. సదరు రహదారికి ఆనుకుని ప్రైవేటు వ్యక్తులకు స్థలం ఉంది. అక్కడ జిల్లా స్థాయిలోనే పెద్ద షాపింగ్‌ మాల్‌ నిర్మించేందుకు ఓ సంస్థ ముందుకొచ్చింది. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ యజమాని నుంచి ఆ స్థలాన్ని కొనుగోలు చేసింది. రియల్‌ ఎస్టేట్‌ యజమానికి పూర్వీకుల నుంచే ఆ స్థలం సంక్రమిం చింది. ఆ స్థలానికి అడ్డుగా మాస్టర్‌ ప్లాన్‌ రహదారిపై (అంటే మునిసిపల్‌ స్థలంలో) అక్రమణలు ఉన్నాయి. వాటిని తొలగించేందుకు రియల్‌ ఎస్టేట్‌ యజమాని పెద్ద మొత్తంలోనే సొమ్ములు వెచ్చించి ఆక్రమణలు ఖాళీ చేయిం చారు. ప్రైవేటు స్థలం పొడవునా మాస్టర్‌ ప్లాన్‌ రహదారి ఖాళీ అయింది.  దాంతో ఏలూరుకు చెందిన ఓ వ్యాపార సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ రహదారికి ఆనుకుని ఉన్న సంబం ధిత ప్రైవేటు  స్థలాన్ని కొనుగోలు చేయడానికి ముందు కొచ్చింది. స్థలం కొనుగోలు జరుగుతోందన్న వార్త నేతకు చేరింది. అంతే అసలు కథ ప్రారంభమైంది. సదరు స్థలంపై నేత కన్ను పడింది. ఆ నేత ఆదేశాలతో అధికారులు అక్కడ వాలిపోయారు. ఆక్రమణలు తొలగాయంటూ హర్షించా ల్సింది పోయి.. మాస్టర్‌ ప్లాన్‌ రహదారి చుట్టూ కంచె వేశా రు. సదరు స్థలాన్ని ఎవరూ ఆక్రమించకుండా ఉండేలా కంచె వేసినట్టు  వివరణ ఇచ్చారు. వారికి అధికార పార్టీ నేత వంత పడ్డారు. మునిసిపాలిటీ స్థలం ఆక్రమణకు గురికాకుండా అడ్డుకుంటే తప్పేముందని చెప్పుకొచ్చారు దీనిపై ప్రతిపక్ష నాయకులు గళం విప్పారు. ఆ నేతకు    సొమ్ములు ముట్ట చెప్పనందుకే కంచె వెలిసిందంటూ విమ ర్శలు గుప్పించారు. ఈ వివాదం నేపథ్యంలో ఏలూరుకు చెందిన సంస్థ మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డుకు ఆనుకుని ఉన్న స్థలం కొనుగోలును వాయిదా వేసింది. దాంతో ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన ఓ పెద్ద (మాజీ మంత్రి) రంగం లోకి దిగి అధికార పార్టీ నేతతో సంప్రదింపులు జరిపారు.   ఆయన మాటకు విలువ ఇచ్చినట్టే ఇచ్చిన అధికార పార్టీ నేత సదరు ప్రైవేటు భూమి క్రయవిక్రయ దారుల నుంచి  రూ.1.50 కోట్లు లాగేశారు. అంతే మాస్టర్‌ ప్లాన్‌ రోడ్డు చుట్టూ ఉన్న కంచె మాయమైంది. ఆక్రమణలున్న చోట సిమెంట్‌ రహదారి వెలసింది. ఇప్పుడు అదే రహదారిపై ప్రైవేటు వాహనాలు నిలుపుతున్నారు. మొత్తానికి పెద్ద మొత్తంలో నేత చేయి తడపడంతో ప్రైవేటు స్థలానికి అడ్డు తొలగించింది. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి మార్గం ఏర్పడింది. ఇటీవలే శంకుస్థాపన చేశారు. దానికి ఆనుకుని ఇప్పుడు విశాలమైన రహదారి ఏర్పడింది. ఇవన్నీ ప్రాజెక్ట్‌ల నిర్మాణా నికి మున్సిపాలిటీ సమకూర్చాలి. కానీ నేతకు సొమ్ములు ఇవ్వనిదే ఎవ్వరూ అడుగు ముందుకు వేయలేరు. ఆ పట్టణంలో ఇదే విషయం నిత్యం హాట్‌ టాపిక్‌గా మారింది.

Updated Date - 2022-09-06T06:06:39+05:30 IST