ముందస్తు జాగ్రత్తలు పాటించండి డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌

ABN , First Publish Date - 2021-04-11T05:16:19+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ రోజురోజుకూ విజృంభిస్తోం దని ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త తీసుకుని తమ ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ సూచించారు.

ముందస్తు జాగ్రత్తలు పాటించండి  డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌
వ్యాక్సిన్‌ కోసం భౌతికదూరం పాటించకుండా ఇలా..

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 10 : కరోనా సెకండ్‌ వేవ్‌ రోజురోజుకూ విజృంభిస్తోం దని ప్రతి ఒక్కరు ముందు జాగ్రత్త తీసుకుని తమ ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా ఆస్పత్రి సేవల సమన్వయాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ సూచించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో  కరోనా వ్యాక్సిన్‌ పం పిణీ జరుగుతున్న విధానాన్ని శనివారం ఆయన పరిశీలించారు. వ్యాక్సిన్‌ నిల్వలు, బ్యాచ్‌ వివరా లను స్వయంగా పరి శీలించి సిబ్బందికి సూచన లు ఇచ్చారు. ఖచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని  ఈనెల 11వ తేదీ నుంచి జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించడానికి చర్యలు చేప ట్టామన్నారు. కోవ్యాగ్జిన్‌, కోవీషీల్డ్‌ రెండు వ్యాక్సిన్లు ఒకటేనని వాటి ప్రభావం ఒకే విధంగా ఉంటుందని, ఎలాంటి అపోహలు వద్దన్నారు. వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి ఏవైనా దుష్పలితాలు కనిపిస్తే ప్రతి ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశామన్నారు.  ఆయనతో పాటు ఆస్పత్రి చీఫ్‌ ఫిజీషియన్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ నాగేశ్వరరావు, డాక్టర్‌ భవానీ ఉన్నారు.  

Updated Date - 2021-04-11T05:16:19+05:30 IST