కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘన

ABN , First Publish Date - 2021-05-17T04:48:05+05:30 IST

పలుచోట్ల పోలీసుల కేసులు నమోదు

కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘన
తాడేపల్లిగూడెంలో పోలీసుల కౌన్సెలింగ్‌

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 16: కర్ఫ్యూ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకునే వారిని సహించేది లేదని పట్టణ సీఐ ఆకుల రఘు హెచ్చరి ంచారు. తాడేపల్లిగూడెం పట్టణంలో 144 సెక్షన్‌కు విరుద్ధంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న 6 వ్యాపార సంస్థలపై కేసులు నమోదుచేసి ఆరుగురిని అరెస్టు చేయడంతోపాటు 40 మంది వాహన చోదకులను పట్టుకుని 40 వాహనాలను సీజ్‌ చేశారు. ఈ సందర్బంగా పట్టణంలో పోలీసులు వ్యాపార సంస్థలకు ముందస్తుగా కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు జీజే ప్రసాద్‌, బి.రాజు, సిబ్బంది పాల్గొన్నారు. 

నిడదవోలు: కర్ఫ్యూ సమయంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిపై కేసులు నమోదు చేస్తున్నట్టు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కేఏ స్వామి తెలిపారు. ఆదివారం రోడ్లపై తిరుగుతున్న పలు వాహనదారులపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ కరోనా వైరస్‌ నివారణకు ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని, వ్యాపార సంస్థల యజ మానులు సైతం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

భీమడోలు: కర్ఫ్యూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఆరుగురిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీహరిరావు తెలిపారు. భీమడోలు మండలంలోని పలు గ్రామాల్లో షాపులు తెరిచి ఉన్న ఇద్దరు వ్యాపారస్తు లుపైన, కర్ఫ్యూ  సమయంలో రోడ్లపై తిరుగుతున్న నలుగురు మోటారు సెక్లిస్టులపైన కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ  తెలిపారు. 




Updated Date - 2021-05-17T04:48:05+05:30 IST