కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

ABN , First Publish Date - 2021-03-05T05:34:14+05:30 IST

ప్రతీఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించు కోవా లని, ఎటువంటి అపోహలు లేకుండా ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లదేనని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునంద స్పష్టం చేశారు.

కొవిడ్‌ వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు

డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునంద

ఏలూరు ఎడ్యుకేషన్‌, మార్చి 4 : ప్రతీఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించు కోవా లని, ఎటువంటి అపోహలు లేకుండా ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యత ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లదేనని డీఎంహెచ్‌వో డాక్టర్‌ సునంద స్పష్టం చేశారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌పై గురువారం జిల్లా నోడల్‌ ఆఫీసర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతీ ఏఎన్‌ఎం ఇంటింటికి తిరిగి గర్భి ణుల వివరాలను ప్రభుత్వం నిర్దేశించిన యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని, గర్భం ధరించిన నాటి నుంచి ప్రస వించే వరకు పూర్తి బాధ్యతను ఫిమేల్‌ సూపర్‌వైజర్లు తీసుకోవాలన్నారు. సంజీ విని యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రజలు తమకు కావాల్సిన డాక్టర్ల నుంచి సల హాలు, సూచనలను వీడియోకాల్‌ ద్వారా పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిం చిందన్నారు. సమావేశంలో అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ రత్నకుమారి, పీవోడీటీటీ డాక్టర్‌ సుధ, డీపీహెచ్‌ ఎన్‌వోలు, డెమో, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

 కొవిడ్‌ టీకా పంపిణీ

జిల్లాలోని ఐదు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో గురువారం 304 మంది సీనియర్‌ సిటిజన్లకు, వీటితోపాటు ఎంపిక చేసిన ప్రభుత్వాసుపత్రుల్లో మరో 546 మంది సీనియర్‌ సిటిజన్లకు వ్యాక్సిన్‌ వేశారు. హెల్త్‌ కేర్‌ వర్కర్లు 251 మందికి తొలి డోసు, 250 మందికి రెండో డోసు టీకా వేశారు. ఇక ఫ్రెంట్‌లైన్‌ వర్కర్లు (పం చాయతీరాజ్‌, మునిసిపల్‌, రెవెన్యూ, పోలీస్‌ ఉద్యోగులు) 614 మందికి మొదటి డోసు, 92 మందికి రెండో డోసు టీకా పంపిణీ చేశారు. 45–59 సంవత్సరాల వయ స్కుల్లో 108 మందికి వ్యాక్సిన్‌ వేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. 

Updated Date - 2021-03-05T05:34:14+05:30 IST