కరోనా–2 గుర్తించేదెలా..!

ABN , First Publish Date - 2021-04-19T05:06:21+05:30 IST

కరోనా వైరస్‌ గతేడాది జిల్లాలో ప్రవేశించిన ప్పుడు ఏ లక్షణాలు ఉంటే కరోనా కనిపెట్టడం కష్టంగా మారింది.

కరోనా–2  గుర్తించేదెలా..!

ఈ లక్షణాలుంటే కరోనా పరీక్ష చేయించుకోండి

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 18: కరోనా వైరస్‌ గతేడాది జిల్లాలో ప్రవేశించిన ప్పుడు ఏ లక్షణాలు ఉంటే కరోనా కనిపెట్టడం కష్టంగా మారింది. అయితే క్రమేపీ కరోనా కేసులపై పరిశోధనలు నిర్వహించి స్పష్టమైన లక్షణాలను వెల్లడించారు. దీంతో అప్పట్లో త్వరితగతిన ఆ లక్షణాలు ఉన్న వారు కరోనా నిర్ధారణ పరీ క్షలను చేయించుకున్నారు. క్రమేపీ నవంబరు నాటికి కరోనా కేసులు తగ్గిపోయా యి. జనవరి, ఫిబ్రవరి నాటికి పూర్తిగా కేసులు లేనేలేవు. తిరిగి మార్చి నెల నుంచి ఒక్కొక్క కేసుగా జిల్లాలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం గత 24 గంటల్లో జిల్లాలో 82 మందికి కరోనా పాటిజివ్‌ రాగా ఇప్పటి వరకు జిల్లాలో 95,139 మంది కరోన బారిన పడ్డారు. ప్రస్తుతం 538 మంది చికిత్స పొందుతున్నారు. 542 మంది ఇప్పటి వరకు మరణించి నట్టుగా అధికారుల రికార్డుల్లో ఉన్నాయి. 

 

కరోనా వైరస్‌ వేవ్‌–2 లక్షణాలిలా..

కరోనా వైరస్‌ వేవ్‌–2 లక్షణాలను వైద్యులు, శాస్త్రవేత్తలు ఇప్పటికే వెల్లడిం చారు. కొద్దిపాటి జ్వరం వచ్చి తగ్గి రావడం, జలుబు చేసి నీరు కారడం, గొంతు నొప్పి రావడం, ఒంటి నొప్పులు రావడం వంటి లక్షణాలు ప్రాథమికంగా కన్పి స్తాయి. మూడు, నాలుగు రోజుల తర్వాత విరోచనాలు అవ్వడం, ఆయాసం రావడం, దగ్గు, శరీరం లోని ఆక్సీజన్‌ లెవెల్స్‌ పడిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా నోటిలో చిన్నచిన్న పొక్కులు ఏర్పడతాయి. ఎవరికైనా జ్వరం వచ్చి, తగ్గడం, మరలా రావడం అలా మూడు రోజులు జరిగితే వారు వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉత్తమమని ఏలూరు ప్రభుత్వాస్పత్రి చీఫ్‌ ఫిజీషియన్‌, కొవిడ్‌ విభాగం మెడికల్‌ నోడల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పోతు మూడి శ్రీని వాసరావు స్పష్టం చేశారు. మొదటిసారిగా వచ్చిన కరోనా బాధితుల్లో ముక్కు వాసన కోల్పోవడం, నాలుక రుచి కోల్పోవడం ఉండేదని ప్రస్తుతం ఈ రెండు లక్షణాలు ఒకరిద్దరిలో మాత్రమే కన్పించాయన్నారు. ఎవరిలోనైనా ఈ లక్షణా లకు గురైతే వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సూచ నల మేరకు మందులు వాడడం ఎంతో శ్రేయస్కరమని డాక్టర్‌ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. కరోనా నిర్ధారణ అయితే ఆందోళన చెందవద్దని ఏలూరు ప్రభు త్వాస్పత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ప్రత్యేక విభాగం అందు బాటులో ఉందని 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉన్నారని ఆయన వెల్లడించారు. 


 అప్పనవీడులో కరోనా పాజిటివ్‌

పెదపాడు, ఏప్రిల్‌ 18: అప్పనవీడులో ఒక కరోనా పాజిటివ్‌ కేసు నిర్ధా ర ణ అయినట్టు వైద్యసిబ్బంది తెలిపారు. దీంతో పరిసర ప్రాంతాల్లో శానిటేషన్‌ పనులు మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టినట్టు పంచాయతీ అధికారులు చెప్పారు. పెదపాడు, వట్లూరు పీహెచ్‌సీల పరిధిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ఆదివారం జరిగింది. ఒక్కొక్క పీహెచ్‌సీ పరిధిలో 50 నుంచి 60 మందికి వ్యాక్సిన్‌ను వైద్యసిబ్బంది అందించారు. 


 ప్రతీ ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోండి 

ఏలూరు టౌటౌన్‌, ఏప్రిల్‌ 18 : నగరంలోని 45 ఏళ్లు దాటిన వారంతా వ్యాక్సిన్‌ తప్పనిసరిగా వేయించుకోవాలని నగర పాలక సంస్థ కమిషనర్‌ డి.చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం సచివాయల్లోనూ, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌లోనూ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుందన్నారు. కరోనా వైరస్‌ ఉధృతం అవుతున్న దృష్ట్యా ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్క్‌ లేకుండా ఎవరూ  బయటకు రావద్దన్నారు. శానిటైజర్‌  రాసుకోవాలన్నారు. ద్విచక్ర వాహనంపై ఇద్దరు, ముగ్గురు తిరగకూడదని హెచ్చరించారు. కరోనా నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. వ్యాపారస్తులు కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మకాలు కొనసాగించాలన్నారు.  

Updated Date - 2021-04-19T05:06:21+05:30 IST