బర్డ్‌ఫ్లూపై అప్రమత్తం

ABN , First Publish Date - 2021-01-11T05:58:25+05:30 IST

దేశంలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది.

బర్డ్‌ఫ్లూపై అప్రమత్తం

మాంసం వినియోగంలో జాగ్రత్తలు తప్పనిసరి

కొల్లేరు పక్షులపై నిఘా... ప్రజలకు ప్రత్యేక అవగాహన

‘ఆంధ్రజ్యోతి’ ఇంటర్వూలో పశుసంవర్ధకశాఖ జేడీ శ్రీనివాస్‌


ఏలూరు టూటౌన్‌, జనవరి 10: దేశంలో బర్డ్‌ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కోళ్ళు, పక్షులకు బర్డ్‌ఫ్లూ సోకి భయాందోళన సృష్టిస్తున్నది. రాష్ట్రంలో ఇంతవరకూ ఎక్కడా బర్డ్‌ఫ్లూ సోకినట్లు గాని ఆ లక్షణాలు ఉన్నట్లుగాని  బయటపడనప్పటికీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసు కుంటున్నారు. అయితే రాష్ట్రంలో కొన్ని చోట్ల పక్షులు నేల రాలుతున్నాయి. ఇవి బర్డ్‌ఫ్లూ వేల్ల మృత్యువాత పడ్డాయా అనే అనుమానాలు కూడా స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాంసం విక్రయాలు కూడా తగ్గిపోయాయి. బర్డ్‌ఫ్లూ గురించి పశుసంవర్ధకశాఖ జేడీ పి.శ్రీనివాస్‌ మాటల్లో....

ఇన్‌ఫ్లూఎంజా వైరస్‌ ద్వారా కోళ్ళు, పక్షుల్లో బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకుతుంది. ఇది రూపాంతరం చెంది హెచ్‌5ఎన్‌1, హెచ్‌3 ఎన్‌1, హెచ్‌1ఎన్‌2 వ్యాధిగా మారుతుంది. ఇది చాలా ప్రమా దకరం. ఇలా  వైరస్‌ రూపాంతరం చెందినప్పుడు కోళ్ళు, పక్షులు చనిపోతాయి. బర్డ్‌ఫ్లూ వస్తే కోళ్లు మెడవాల్చడం, సొంగ కార్చడం, ముడుచుకుని కూర్చోవడం లాంటి లక్షణా లు కన్పిస్తాయి. 

మనుషులకూ సోకుతుంది...

బర్డ్‌ ఫ్లూ మనుషులకు కూడా సోకే అవకాశం ఉంది. ఎక్కువగా కోళ్ళు, పక్షులతో సహవాసం చేసే మనుషులకు సోకుతుంది. కోళ్ళ ఫారాల్లో పనిచేసే వారికి బర్డ్‌ ఫ్లూ సోకే అవకాశం  ఎక్కువ. బర్డ్‌ఫ్లూ సోకిన వారు అనారోగ్యానికి గురవుతారు. అంతేకాని చనిపోయే అవకాశం లేదు. ఇలాంటి వారు కరోనా వైరస్‌ లాగా జాగ్రత్తలు పాటించాలి. మాస్క్‌లు ధరించడం, శానిటైజర్‌ రాసుకోవడం, సాధ్యమైనంత వరకూ కోళ్ళకు దూరంగా ఉండాలి. ఆస్తమా, ఊపిరితిత్తుల్లో అనారో గ్యం ఉన్న వారికి త్వరగా సోకుతుంది. 

కోళ్ళు, పక్షులకు బర్డ్‌ఫ్లూ సోకకుండా అవగాహన కల్పిస్తు న్నాం. పౌలీ్ట్ర ఫారం నిర్వహించే రైతులకు బర్డ్‌ఫ్లూ సోకకు ండా పరిశుభ్రత పాటించే విధంగా అవగాహన కల్పిస్తు న్నాం. పరిసర ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవ డం, బ్లీచింగ్‌ చల్లడం, లైజాల్‌, డెట్టాల్‌తో కడుక్కోవడం చేసు కోవాలి. మాంసం అమ్మేవారు కొనేవారు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మాంసాన్ని వండుకుని తినేటప్పుడు పూర్తిగా ఉడకబెట్టుకుని తినాలి. జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించడానికి, వైద్యం అందించడానికి 62 టీమ్‌లను ఏర్పాటు చేశాం. వీరు సచివాలయంలోని పశుసంవర్ధక సహాయకులతో కలిసి గ్రామం,  వార్డుల్లో తిరిగి అవగాహన కల్పించడంతోపాటు  వైద్య సదుపాయాలు కల్పిస్తాం. కోళ్ళకు గాని, పక్షులకుగాని బర్డ్‌ఫ్లూ సోకినట్లు తెలిస్తే ప్రజలు ఈ టీమ్‌ను సంప్రదించాలి. 

 వలస పక్షుల పట్ల అప్రమత్తం

కొల్లేరులో వలస పక్షులు ఏ ప్రాంతం నుంచి వస్తు న్నాయో అనేదానిపై ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి నిఘా ఏర్పాటు చేశాం. ఏమైనా వలస పక్షులు కన్పిస్తే వాటిని పట్టుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తాం. కాకులు, కొంగలు, పావురాలు లాంటి పక్షులపై కూడా అప్రమత్తంగా ఉన్నాం. బర్డ్‌ఫ్లూతో చనిపోయిన కోళ్ళను, పక్షులను కాల్చి వేస్తే మంచిది. లేకపోతే మూడు అడుగుల గొయ్యి తవ్వి పాతిపెట్టాలి. చనిపోయిన కోళ్ళను, పక్షులను ఎక్కడ పడితే అక్కడ బహిరంగ ప్రదేశాల్లో పారవేయకూడదు. అలాంటి వాటి ద్వారా కూడా వైరస్‌ విజృంభించే అవకాశం ఉంది. జిల్లాలో సుమారుగా కోటి 20 లక్షల కోళ్ళ ఫారాల్లో కోళ్ళు పెంచుతున్నారు. సొంతగా ఇళ్ళల్లో పెంచే పెరటి కోళ్ళు సుమారు 50 లక్షలు ఉన్నాయి. 


Updated Date - 2021-01-11T05:58:25+05:30 IST