సర్వే.. సంకటం!

ABN , First Publish Date - 2022-09-06T06:02:13+05:30 IST

విద్యుత్‌ సబ్సిడీపై తమకు అన్యాయమే జరుగుతోందంటూ కొన్ని నెలలుగా కొంత మంది ఆక్వా రైతుల ఆందోళనపై ప్రభుత్వం ఆరా తీస్తోం ది.

సర్వే.. సంకటం!

ఆక్వా జోన్‌ నష్టంపై  మత్స్యశాఖ  గ్రామ సర్వే
ఆక్వా జోన్‌లో 20 వేల ఎకరాలే అంటున్న రైతులు
రెండు వందల ట్రాన్స్‌ ఫార్మర్లు పరిధిలోనే సబ్సిడీ వర్తింపు


భీమవరం, సెప్టెంబరు 5 : విద్యుత్‌ సబ్సిడీపై తమకు అన్యాయమే జరుగుతోందంటూ కొన్ని నెలలుగా కొంత మంది ఆక్వా రైతుల ఆందోళనపై ప్రభుత్వం ఆరా తీస్తోం ది. నిజంగా అర్హత కలిగిన వారు ఆక్వా జోన్‌ బయట ఉన్నారా? ఉంటే ఎంతశాతం ఉండవచ్చు.. అనే అంశా లపై ప్రాథమికంగా గ్రామాల వారీగా సర్వే చేపడుతున్నారు. గత నెల 26వ తేదీన జిల్లా వ్యవసాయశాఖ సమీక్షా సమావేశంలో ‘జోన్‌ పరిధిలో లేని చెరువుల గుర్తింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది..’ అంటూ కలెక్టర్‌ పి.ప్రశాంతి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆక్వా జోన్‌ ప్రకారం సర్వే నంబర్లు రీకన్సిలేషన్‌ చేస్తామని కలెక్టర్‌ వెల్లడించారు. చిన్న రైతుల సాగునకు సంబంధిత రైతు ఎన్‌టైటిల్మెంట్‌ ప్రకారం నమోదు చేయాలని విద్యుత్‌ అధికారులకు సూచిస్తామన్నారు. గ్రామ, మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాల్లో సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుని జిల్లా స్థాయిలో చర్చించి ప్రభుత్వానికి నివేదిస్తామని కలెక్టర్‌ హామీ ఇచ్చారు. మొత్తం మీద నిజమెంతో తెలుస్తామన్నట్టు అధికారులు  సర్వే చేపట్టారు. ఆక్వా జోన్‌ వల్ల కొన్ని నెలలుగా 80 శాతం మంది రైతులు అన్యాయానికి గురవుతున్నారని అంటూ ఆక్వా ఫార్మర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జీకేఎఫ్‌ సుబ్బరాజు  అన్నారు. దీనిపై రెండు, మూడు దఫాలు సమావేశాలు, ఆందోళన చేపట్టిన సంగతి విదితమే. మొత్తంగా జిల్లాలో 20 వేల ఎక రాలకు లోపు మాత్రమే ఈ సబ్సిడీ అందుతోందంటున్నా రు. గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్‌ఫార్మార్లు ఉచితంగా ఇవ్వడంతో ప్రతీ మండలంలో 1000 నుంచి 1200 వరకు ఆక్వా చెరువులకు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సబ్సిడీ మార్చడం వల్ల సుమారు రెండు వందల ట్రాన్స్‌ ఫార్మర్లు పరిధిలో మా త్రమే ఈ సబ్సిడీ అందుతోందని సుబ్బరాజు ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేయాలని ఆయన కోరుతున్నారు. గత వారంలో కూడా ఆక్వా రైతుల సంఘం ఎంపెడా డా.వైస్‌ చైర్మన్‌ భీమవరం వచ్చినప్పుడు విద్యుత్‌ సబ్సిడీ ఇవ్వకపోతే ఆక్వా సాగు చేయలేమని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఏవిధంగా ఈ సర్వే జరుగుతుందో ఆక్వా జోన్‌ వ్యవస్థ ఏమేరకు సవరణ చేస్తారో చూడాలి. 

Updated Date - 2022-09-06T06:02:13+05:30 IST