బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

ABN , First Publish Date - 2022-08-18T06:26:26+05:30 IST

గతనెల 12న ‘ఆంరఽధజ్యోతి’లో మార్టేరులో బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి దివంగత నేత వైఎస్‌ రాజ శేఖర్‌ రెడ్డి విగ్రహామే అడ్డంకి గా మారిన వైనంపై కథనం ప్రచు రితమైంది.

బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి తొలగిన అడ్డంకులు

 ఆంధ్రజ్యోతి వార్తకు స్పందన
పెనుమంట్ర, ఆగస్టు 17 : గతనెల 12న ‘ఆంరఽధజ్యోతి’లో మార్టేరులో బస్‌ షెల్టర్‌ నిర్మాణానికి దివంగత నేత వైఎస్‌ రాజ శేఖర్‌ రెడ్డి విగ్రహామే అడ్డంకి గా మారిన వైనంపై కథనం ప్రచు రితమైంది. ఈ వార్తపై అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందిం చారు. విగ్రహాన్ని పక్కకు తొలగించి మరో దిమ్మపై ఏర్పాటు చేసే విధంగా స్థానిక రెడ్డి యూత్‌ పంచాయతీ అనుమతిని తీర్మాన రూపంలో తీసుకుని పాతదిమ్మ పక్కన కొత్తగా నిర్మించిన దానిపై బుధవారం ఉంచారు. దీంతో బస్‌షెల్టర్‌ నిర్మాణానికి అడ్డంకి తొల గింది. ఎమ్మెల్యే చెరుకు వాడ శ్రీరంగనాథరాజు సొంత నిధులు రూ.30 లక్షలతో కొత్త బస్‌ షెల్టర్‌ నిర్మిస్తానని గతంలో ప్రకటిం చారు. త్వరలో పనులు చేపడతారని చెబుతున్నారు. 

Updated Date - 2022-08-18T06:26:26+05:30 IST