రైతులకు షాక్‌

ABN , First Publish Date - 2022-01-22T06:01:07+05:30 IST

రైతులకు ప్రభుత్వం షాకిస్తోంది. మీటర్లు బిగించేందుకు అంగీకరించని రైతులు వేల రూ పాయాల్లో బిల్లులు చెల్లించే పరిస్థితి నెలకొంది.

రైతులకు షాక్‌

విద్యుత్‌ మీటర్లకు అంగీకరించని వారికి వేలల్లో బిల్లులు
వారికి దరఖాస్తు చేసుకునే అవకాశం
ఆదాయపు పన్ను, రెవెన్యూ శాఖల నుంచి
ధ్రువీకరణ పత్రాలు తేవాలంటూ నిబంధన
వ్యవసాయ కనెక్షన్‌ లపై విద్యుత్‌ శాఖ తాజా నిర్ణయం


(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి):
రైతులకు ప్రభుత్వం షాకిస్తోంది. మీటర్లు బిగించేందుకు అంగీకరించని రైతులు వేల రూ పాయాల్లో బిల్లులు చెల్లించే పరిస్థితి నెలకొంది. మోటార్‌ హార్స్‌ పవర్‌ ఆధారంగా బిల్లులు వడ్డిస్తున్నారు. రైతులు 20 హార్స్‌పవర్‌ మోటారు విని యోగిస్తే నెలకు రూ.4 వేలు బిల్లు వస్తోంది. రెండు నెలల బిల్లు రూ.8 వేలు చెల్లించాలంటూ డిమాండ్‌ నోటీసు పంపుతున్నారు. మీటరు బిగించాలని దర ఖాస్తు చేసుకుందామంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి నిరభ్యంతర పత్రాన్ని తీసుకు రావాలి. అంటే సదరు రైతు ఆదాయపు పన్ను పరిధిలో ఉండకూడదు. ఉచిత విద్యుత్‌ కనెక్షన్‌ అనుభవిస్తున్న రైతుకు వ్యవసాయం తప్ప వేరే ఆదాయం లేదంటూ తహసీల్దార్‌ ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. ఇలా ఆదాయపు పన్ను శాఖ, రెవెన్యూ శాఖలు ఇచ్చే సర్టిఫికెట్‌లు సమర్పిస్తేనే మీటరు బిగించేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మీటరు అక్కరలేదనే వారికి రాయితీ లేకుండా పూర్తిస్థాయి బిల్లు పంపుతు న్నారు. తొలుత సంతకాలు చేసి మీటర్లకు అను మతించే రైతులు ప్రస్తుతానికి బిల్లు భారం లేకుండా సురక్షితంగా ఉన్నారు. జిల్లాలో 1.05 లక్షల వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌లున్నాయి.అందులో లక్ష మంది మీటర్లు బిగించేం దుకు ముందుగానే అంగీకారపత్రాన్ని సమర్పించారు. మరో 5 వేల మంది రైతులు నిరాకరించారు. వారికిప్పుడు బిల్లులు రూపంలో భారం మోపుతున్నారు. మీటర్లకు అంగీకరించే రైతులు మాత్రం నెలకు రూ.30 చెల్లిస్తున్నారు. మీటర్లు వద్దంటూ నిరాకరించిన రైతులు వేలల్లో బిల్లు చెల్లించాలంటూ డిమాండ్‌ నోటీసులు అందుకుంటున్నారు. ఈ రైతులు మరోసారి అంగీకారపత్రం సమర్పించడానికి విద్యుత్‌ శాఖ అవకాశం కల్పించింది. కానీ రెవెన్యూ, ఆదాయపు పన్ను శాఖల నుంచి  ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలన్న నిబంధన పెట్టారు. భవిష్యత్తులో అందరి రైతులకు ఇదే రకమైన నిబంధనలు వర్తింపజేస్తారన్న అనుమానాలున్నాయి.మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినప్పుడే రైతులకు లెక్కకు మిక్కిలి సందేహాలు తలెత్తాయి. 

Updated Date - 2022-01-22T06:01:07+05:30 IST