ఏలూరు శాయ్‌ సెంటర్‌ తరలింపు అవాస్తవం

ABN , First Publish Date - 2022-01-21T05:15:40+05:30 IST

కేంద్ర ప్రభుత్వ ఆధీనం లో నడుస్తున్న స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌ సెంటర్‌)ను ఏలూరు నుంచి తరలించినట్టు వస్తున్న వార్త ల్లో నిజం లేదని, ఇక్కడ ఉన్న ఆటగాళ్లు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్నారని ఆ సెంటర్‌ ఇన్‌చార్జి వినాయకప్రసాద్‌ తెలిపారు.

ఏలూరు శాయ్‌ సెంటర్‌ తరలింపు అవాస్తవం

సెంటర్‌ ఇన్‌చార్జి వినాయక ప్రసాద్‌
ఏలూరు స్పోర్ట్స్‌, జనవరి 20 : కేంద్ర ప్రభుత్వ ఆధీనం లో నడుస్తున్న స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (శాయ్‌ సెంటర్‌)ను ఏలూరు నుంచి తరలించినట్టు వస్తున్న వార్త ల్లో నిజం లేదని, ఇక్కడ ఉన్న ఆటగాళ్లు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో శిక్షణ పొందుతున్నారని ఆ సెంటర్‌ ఇన్‌చార్జి వినాయకప్రసాద్‌ తెలిపారు. ఆయన గురువారం విలేకరుల సమా వేశంలో మాట్లాడుతూ శాయ్‌ సెంటర్‌ 30 ఏళ్లుగా కొనసాగుతోందని అథ్లెటిక్స్‌, హ్యాండ్‌ బాల్‌, హాకీ, వెయిట్‌ లిఫ్టింగ్‌ తదితర అంశాల్లో శిక్షణ అందిస్తున్నట్టు తెలిపారు. అయితే కేవలం ఇక్కడ పది గదులు మాత్రమే ఉన్నాయన్నారు. గతంలో 200 మంది శిక్షణ పొందితే ప్రస్తుతం ఏలూరులో 65 మంది శిక్షణ పొందుతున్నారని, వీరిలో 30 మంది గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో సింథటిక్‌ ట్రాక్‌ ఉండడంతో అక్కడ శిక్షణ పొందుతున్నా రన్నారు. శాయ్‌ సెంటర్‌ను తరలిస్తున్న ట్టు ప్రచారం జరుగుతుందని, ఇది కేవలం అవాస్తవమన్నారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణానికి ఎనిమిది కోట్లకు పైగా ఖర్చు అవుతుందని, ఇందుకోసం అనుమతికి శాయ్‌కు ప్రతిపాదనలు పంపించి నట్టు తెలిపారు. ఇదే విషయమై ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్‌ను కలిసి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు.

Updated Date - 2022-01-21T05:15:40+05:30 IST