ఏలూరు: పోలవరం నిర్వాసితుల దీక్షకు మద్దతు తెలియజేస్తున్న టీడీపీ నేతల గృహ నిర్బంధాన్ని ఖండిస్తున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దాసరి శ్యామ్ సుందర్ శేషు అన్నారు. కనీసం పరామర్శించడానికి, సంఘీభావం తెలియజేయడానికి కూడా పోలీసుల అరెస్టులా అంటూ మండిపడ్డారు. ‘‘ఇదెక్కడి న్యాయం.. మేము ఏమన్నా మనీ లాండరింగ్ కేసుల్లో ఉన్నామా.. దేశం వదిలిపోతున్నామా’’ అంటూ దాసరి శ్యామ్ సుందర్ శేషు ప్రశ్నించారు.