తండ్రికి తలకొరివిపెట్టిన తనయ

ABN , First Publish Date - 2022-09-29T05:36:59+05:30 IST

కన్న తండ్రి కోరిక మేరకు ఆ కూతురు .. చివరి క్షణాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించి రుణం తీర్చుకుంది.

తండ్రికి తలకొరివిపెట్టిన తనయ
తండ్రి చితికి దహన సంస్కారాలు చేస్తున్న కూతురు ప్రియదర్శిని

తణుకు, సెప్టెంబరు 28: కన్న తండ్రి కోరిక మేరకు ఆ కూతురు .. చివరి క్షణాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించి రుణం తీర్చుకుంది. మగ పిల్లలు లేని లోటు ఎక్కడా కనిపించ కుండా తన తండ్రి చితికి నిప్పు పెట్టింది. తణుకు పట్టణానికి చెందిన బీవీ కృష్ణారావు గుండెపోటుతో సోమ వారం రాత్రి మృతిచెందాడు. ఆయనకు భార్య పద్మజ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె బి.రాధిక ప్రియదర్శిని భీమవరంలోని జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ కార్యాలయంలో టెక్నికల్‌ అగ్రికల్చర్‌గా, చిన్న కుమార్తె ఉష ప్రియదర్శిని అమెరికాలో ఉంటున్నారు. చిన్న కుమార్తె బుధవారం సాయంత్రం అమెరికా నుంచి రావడంతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

Updated Date - 2022-09-29T05:36:59+05:30 IST