విశ్వదుర్గేశ్వరి ఆభరణాలు స్వాధీనం

ABN , First Publish Date - 2021-03-08T04:12:59+05:30 IST

తాడేపల్లిగూడెం విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆభరణాల చోరీ కేసును పట్టణ పోలీ సులు చేధించారు.

విశ్వదుర్గేశ్వరి ఆభరణాలు స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ శ్రీనాథ్‌

చోరీ జరిగిన రెండేళ్ల తర్వాత పట్టుకున్న పోలీసులు

తాడేపల్లిగూడెం క్రైం, మార్చి 7 : తాడేపల్లిగూడెం విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో ఆభరణాల చోరీ కేసును పట్టణ పోలీ సులు చేధించారు. డీఎస్పీ శ్రీనాథ్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 2019 సంవ త్సరం ఆగస్టు 5న ఆలయ తలు పులు పగలకొట్టి అమ్మ వారి వెండి ఆభరణాలు అపహరించారు. అప్పటిలో పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా విజయవాడ కనకదుర్గమ్మ  ఆభరణాల కేసులో విజ యవాడ పోలీసులు కస్టడీలోకి తీసుకున్న సాయిని పట్టణ సీఐ ఆకుల రఘు,ఎస్‌ఐ గుర్రయ్య జ్యుడీషియల్‌ కస్టడీకి తీసుకుని విచారించారు. దీంతో తాడేపల్లిగూడెంలో అమ్మవారి ఆభరణాలు దొంగిలించినట్టు నేరం అంగీ కరించాడు. ఆ ఆభరణాలను భీమవరంలోని ఓ బంగారు దుకాణంలో తాకట్టు పెట్టినట్టు చెప్పగా ఆ ఆభర ణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ రూ.5.30 లక్షలు ఉంటుందని తెలిపారు.ఎస్పీ నారాయణ నాయక్‌ ఫోన్‌లో డీఎస్పీ శ్రీనాథ్‌, సీఐ ఆకుల రఘు, ఎస్‌ఐ గుర్రయ్య, సిబ్బందిని అభినందించారు. 

Updated Date - 2021-03-08T04:12:59+05:30 IST