దొంగలు దొరికారు

ABN , First Publish Date - 2022-09-10T06:29:27+05:30 IST

పగటి పూట రెక్కీ నిర్వహిస్తాడు.. నచ్చిన ఇంటిని ఎంచుకుని రాత్రిపూట ఆ ఇంట్లోనే చోరీ చేస్తాడు

దొంగలు దొరికారు
నిందితుడి వివరాలు వెల్లడిస్తున్న పశ్చిమ జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌

వారంతా దొంగతనాలు చేయడంలో ఏళ్ల తరబడి అనుభవం సాధించిన సిద్ధహస్తులు.
రెక్కీ నిర్వహించారంటే దొంగతనం జరిగిపోవాల్సిందే. ఎంతటి సొత్తు అయినా వశమవ్వాల్సిందే. అయితే చివరికి పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యారు. వారి వివరాలను శుక్రవారం ఉమ్మడి జిల్లాల ఎస్పీలు రవిప్రకాష్‌, రాహుల్‌దేవ్‌ శర్మ వెల్లడించారు.


భీమవరంలో అంతరాష్ట్ర దొంగ అరెస్ట్‌.. నిందితుడిపై 75 కేసులు


818 కేసుల్లో రూ.44 లక్షల సొత్తు రికవరీ : ఎస్పీ రవిప్రకాష్‌


భీమవరం క్రైం, సెప్టెంబరు 9 : పగటి పూట రెక్కీ నిర్వహిస్తాడు.. నచ్చిన ఇంటిని ఎంచుకుని రాత్రిపూట ఆ ఇంట్లోనే చోరీ చేస్తాడు.. పైపైచ్చు ఇంట్లో మనుషులు ఉంటేనే ఆ ఇంటికి దొంగతనానికి వెళ్తాడు.. ప్రధాన ద్వారం పక్కన కిటికీ ఊసలు తప్పించి లోపల తలుపు గెడ తెరిచి ఇంట్లోకి ప్రవేశించి తన పని కానిస్తాడు. అలాంటి దొంగ భీమవరంలో ఓ దొంగతనానికి వెళ్లి పోలీసులకు దొరికిపోయాడు. జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్‌ భీమవరం టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో  శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపిన వివరాలివి.. కాకినాడ జిల్లా జగన్నాథపురం శివారు ఏటిమొగకు చెందిన పొన్నాడ రవిశంకర్‌ (వీరబాబు) (30) వ్యసనాలకు బానిసై 2006 నుంచి దొంగతనాలు చేస్తూ ఆ సొమ్ముతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి జల్సా చేసేవాడు. ఈ క్రమంలోనే అరెస్టయి జైలుకు వెళ్లాడు. గతేడాది అక్టోబరు 28 వైజాగ్‌ జైలు నుంచి బయటకు వచ్చాడు. అతనిపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు హైదరాబాద్‌లో మొత్తం 75 దొంగతనాల కేసులు ఉన్నాయి. గత నెల 29న భీమవరం టూ టౌన్‌లోని శ్రీరాంపురంలో సాయిబాబా గుడి సమీపంలో పుప్పాల చంద్రశేషుమూర్తి నివాసంలో భారీ దొంగతనం జరిగింది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం గొల్లవానితిప్ప రోడ్డు టర్నింగ్‌ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కన్పించిన రవిశంకర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.
ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో మొత్తం 18 దొంగతనాలు చేశాడు. భీమవరం టూ టౌన్‌, తణుకులలో మూడేసి చొప్పున, ఇరగవరంలో 2, భీమవరం వన్‌టౌన్‌, పెనుగొండ, తాడేపల్లిగూడెం, పాలకోడేరు, పోడూరు, పెంటపాడు, వీరవాసరంలలో ఒక్కొక్కటి చొప్పున, ఏలూరు జిల్లా పరిధిలో గణపవరంలో 1, తూర్పుగోదావరి కడియం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో 2 చోరీలకు పాల్పడినట్టు అంగీకరించడంతో అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 18 కేసులకు సంబంధించి 70 కాసులు బంగారం, రూ.6 లక్షల నగదు, 3 లాప్‌టాప్‌లు, 6 మోటార్‌ సైకిళ్లు, ఒక కారు కలిపి మొత్తం రూ.43 లక్షల 70 వేలు విలువ చేసే సొత్తును రికవరీ చేసి స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన టూటౌన్‌ సీఐ కృష్ణకుమార్‌, సీసీఎస్‌ సీఐ రఘు, ఎస్‌ఐలు రాంబాబు, వీరబాబు, కానిస్టేబుళ్లు బాబూరావు, శ్రీనివాస్‌, నరేష్‌, అక్బర్‌, మహేశ్వరరావు, మోహనరావు, శివకుమార్‌, రామకృష్ణలను ఎస్పీ అభినందించారు.
========================================================
దొంగతనం .. విలాస జీవితం

పోలీసుల అదుపులో అంతర్‌ రాష్ట్ర దొంగలు

తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెంబర్‌ 9: తెలుగు రాష్ట్రాల్లో పలు చోరీలకు పాల్పడుతున్న అంతర్‌ రాష్ట్ర దొంగలను తాడేపల్లి గూడెం పోలీసులు  ఎట్టకేలకు శుక్రవారం అరెస్టు చేశారు. వారిని ఏఎస్పీ రవికుమార్‌ విలేకరుల ముందు ప్రవేశ పెట్టి వివరాలు వెల్లడించారు. తాడేపల్లిగూడెం ప్రాంతంలో రాత్రిపూట దొంగతనాలు జరుగుతున్న ట్టు ఫిర్యాదులు అందాయన్నారు. దీంతో ఎస్పీ రవిప్రకాష్‌ ఆదేశాల మేరకు సీఐ నాగరాజు ఆధ్వర్యంలో పలువురు అనుమానితులపై నిఘా పెట్టామన్నారు. కొయ్యలగూడెం మండలం గవరవ రానికి చెందిన తోట శివభవాని అలియాస్‌ శివకు మార్‌ నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించామన్నా రు. ఈ క్రమంలో గాలింపు చేపట్టగా శివకుమార్‌, వరలక్ష్మి, యాళ్ల ఐసక్‌ ఆసీస్‌ను పట్టుకుని వారి వద్ద నుంచి 145 గ్రాముల బంగారం, రెండు మోటారు సైకిల్స్‌ స్వాధీనం చేసుకున్నామని తెలి పారు. విచారణలో శివకుమార్‌ అతని భార్య వర లక్ష్మి, ఉంగుటూరు మండలం కైకరానికి చెందిన యాళ్ల ఐసక్‌ ఆసీస్‌ దొంగతనాలు చేస్తూ విలాస వంతమైన జీవితం గడుపుతున్నట్టు తెలిసింద న్నారు. తాడేపల్లిగూడెం టౌన్‌, గణపవరం, గాజు వాకలో చోరీలకు పాల్పడినట్టు వివరించారు. అతనితోపాటు మోటారసైకిల్‌ దొంతనం కేసులో తాడేపల్లిగూడెంకు చెందిన జన్నల అయ్యప్పను అరెస్టు చేశామ న్నారు. సీఐలు నాగరాజు, సత్యనారాయణమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు.

11 ఏళ్లుగా చోరీలు

ఇద్దరు అంతర్‌ జిల్లాల దొంగలు అరెస్ట్‌.. 21 బైక్‌లు, బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం : ఎస్పీ రాహుల్‌

ముదినేపల్లి, సెప్టెంబరు 9 : పలు జిల్లాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరు అంతర్‌ జిల్లాల నేర స్థులను ఏలూరు జిల్లా ముదినేపల్లి పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. 21 బైక్‌లు, వెండి, బంగారపు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నా రు. ముదినేపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్పీ రాహు ల్‌ దేవ్‌శర్మ వివరాలు వెల్లడించారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన ఏడిద సత్యనారాయణ, పశ్చిమ గోదావరి జిల్లా కాళ్లకూరుకు చెందిన కొంచాడ ప్రసాద్‌ అనే యువకులు పదకొండేళ్లుగా వేర్వేరుగాను, సం యుక్తంగాను తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఏలూరు జిల్లాల్లో బైక్‌ల చోరీ, గృహాల్లో చోరీల కు పాల్పడ్డారు. వీరిపై 60కి పైగా దొంగతనాల కేసులు నమోదయ్యాయన్నారు. ప్రస్తుతం 21 కేసుల్లో వీరిరువురిని అరెస్టు చేశామని, రూ. 13.12 లక్షల విలువైన బైక్‌లు, వెండి, బంగా రపు అభరణాలను స్వాధీనం చేసుకున్నామ న్నారు. కైకలూరు, మండవల్లి, కలిదిండి, యల మంచిలి, మొగల్తూరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో పదకొండు బైక్‌ల చోరీకి నిందితుడు ఏడిద సత్యనారాయణ ఒక్కడే పాల్పడ్డాడని, ముది నేపల్లి మండలంలో తొమ్మిది బైక్‌లు, చేవూరు లో ఒక ఇంటిలో దొంగతనం, ఇద్దరూ కలసి చేశారని ఎస్పీ వివరించారు. ఒక యూనికాన్‌ బైక్‌ వివరాలు ఇంకా లభ్యం కాలేదని, ఇతర దొంగతనాల కేసుల్లో దర్యాప్తు జరుగుతుంద న్నారు. కైకలూరు సీఐ వైవీఎల్‌.నాయుడు, ఎస్‌ఐ షణ్ముఖసాయి పాల్గొన్నారు. కైకలూరు కోర్టులో నిందితులను హాజరుపర్చగా మేజిస్ట్రేష న్‌ శ్రీహరి రిమాండ్‌ విధించారు.

Updated Date - 2022-09-10T06:29:27+05:30 IST