నిర్భయంగా..నిష్పక్షపాతంగా ఓటెయ్యండి..

ABN , First Publish Date - 2021-01-27T05:26:09+05:30 IST

‘ప్రజా స్వామ్య పటిష్టత, మనుగడ ప్రతి ఓటరుపై ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండటంతోపాటు ఎన్నికల్లో నిర్భ యంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవా లి’ అని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు పిలుపునిచ్చారు.

నిర్భయంగా..నిష్పక్షపాతంగా ఓటెయ్యండి..
జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేస్తున్న కలెక్టర్‌ ముత్యాలరాజు, చిత్రంలో డీఐజీ మోహనరావు, ఎస్పీ నారాయణ నాయక్‌, జేసీలు తదితరులు

గణతంత్ర దిన వేడుకల్లో కలెక్టర్‌ ముత్యాలరాజు పిలుపు

మూడు దశల్లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ

వింత వ్యాధిపై భయం వద్దు.. చర్యలు తీసుకున్నాం

భూముల రీ సర్వేకు రికార్డులను సిద్ధం

విద్యార్థులకు నీట్‌, ఐఐటీ, ఎంసెట్‌ శిక్షణ 

170 మంది ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు

ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శనలు


ఏలూరు ఫైర్‌ స్టేషన్‌, జనవరి 26: ‘ప్రజా స్వామ్య పటిష్టత, మనుగడ ప్రతి ఓటరుపై ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండటంతోపాటు ఎన్నికల్లో నిర్భ యంగా, నిష్పక్షపాతంగా వినియోగించుకోవా లి’ అని జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు పిలుపునిచ్చారు. ఏలూరు పోలీస్‌ పరేడ్‌ గ్రౌం డ్‌లో మంగళవారం 72వ గణతంత్ర దిన వేడు కలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనాన్ని కలెక్టర్‌ స్వీకరించారు. స్వాతంత్య్ర పోరాటంలో అమర వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, పటేల్‌, అల్లూరి సీతారామరాజు, బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ వంటి మహనీయుల త్యాగాలను ఎప్పుడూ మననం చేసుకోవాలి. జిల్లా సర్వతో ముఖాభి వృద్ధికి ప్రతి ఒక్కరూ తోడ్పాటును ఇవ్వాలి. కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. మాస్క్‌ ధరిం చి, సామాజిక దూరం పాటిస్తూ.. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో విడతలో పోలీసు, పురపాలక, రెవెన్యూ, పంచాయతీరాజ్‌ సిబ్బందికి, మూడో దశలో 50 ఏళ్లు దాటిన వారికి ఇస్తారు. ఈ దశల్లో వారు తప్పనిసరిగా టీకాలు వేయిం చుకోవాలి. అంతుచిక్కని వింత వ్యాధితో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుం ది’ అని చెప్పారు. ‘జిల్లాలో భూముల రీ సర్వే గురించి భూ రికార్డులను సిద్దం చేస్తున్నా మన్నారు. విద్యార్థులకు నీట్‌, ఐఐటీ, ఎంసెట్‌ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ‘మహిళలు, లైం గిక వేధింపులకు గురికాకుండా దిశ వన్‌స్టాప్‌ సెంటర్‌లో ప్రత్యేక సేవలు అందిస్తున్నాం. బాలికలు, స్ర్తీలపై జరిగే అత్యాచారాలను విచా రించేందుకు ప్రత్యేక ఫోక్సో కోర్టును ప్రారంభిం చాం. దేవాలయాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా జడ్జి ఇ.భీమారావు, డీ ఐసీ కేవీ మోహనరావు, ఎస్పీ కె.నారాయణనా యక్‌, జాయింట్‌ కలెక్టర్లు కె.వెంకటరమణారెడ్డి, హిమాన్షుశుక్లా, ఎన్‌.తేజ్‌భరత్‌, డీఆర్‌వో శ్రీనివా సమూర్తి, సబ్‌ కలెక్టర్‌ కేఎస్‌ విశ్వనాధన్‌, ఆర్డీ వో పి.రచన, జిల్లా అధికారులు పాల్గొన్నారు. 


 ఆకట్టుకున్న కళారూపాలు

రిపబ్లిక్‌ డే వేడుకల్లో చిన్నారుల నృత్యరూపాలు ఆకట్టుకున్నాయి. ఏలూరు సెయింట్‌ థెరిస్సా బాలికోన్నత పాఠశాలలు ప్రదర్శించిన ‘అంతరాలు దూరమై.. అందరూ సమానమై’ కళారూపం జాతీయ సమైక్యతను చాటి చెప్పింది. ఏలూరు సురేశ్‌చంద్ర బహుగుణ పోలీస్‌ ఉన్నత పాఠశాల విద్యార్థుల ‘నమో నమో భారతంబే’ రూపకం, ఏలూరు శర్వాణి విద్యార్థుల ‘భరతమాత పాదాలకు మువ్వలం.. ఆమె మోముపై చిరు నవ్వులం’, ఏలూరు కస్తూరిబా హైస్కూలు విద్యార్థినుల ‘జనగణ మణ పాడాలిరా..’ నృత్య రూపం ఆలోచింపచేశాయి. భీమవరం వెస్ట్‌బెర్రీ విద్యార్థుల స్కిప్పింగ్‌ విన్యాసాలు అబ్బురపరిచాయి. బుట్టాయగూడెం మండలం తెల్లవారిగూడెం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థుల ‘రేల నృత్యం’ గిరిజన సంస్కృతిని ప్రతిబింబించింది. భీమవరం కాకతీయ హైస్కూల్‌ విద్యార్థుల రాజస్థానీ జానపద నృత్యం ‘కల్‌ బెలియా’ నృత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 


 మహనీయులను ఆదర్శంగా తీసుకోవాలి

ఏలూరు క్రైం, జనవరి 26 : మహనీయులను ఆదర్శంగా తీసుకుని వారి అడుగుజాడల్లో నడవాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు అన్నారు. ఏలూరు డీఐజీ బంగ్లా వద్ద గణతంత్ర వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేశారు. ఎస్పీ బంగ్లా వద్ద జిల్లా ఎస్పీ నారాయణ నాయక్‌ జాతీయ జెండా ఎగురవేశారు. అదనపు ఎస్పీ ఏవీ సుబ్బరాజు, పోలీసు అధికారులు పాల్గొన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను అనుభవిస్తూ బాధ్య తలు నెరవేర్చాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు సూచించారు. జిల్లా కోర్టు భవనంపై ఆయన జాతీ యజెండా ఎగురవేశారు. న్యాయమూర్తులు మల్లికార్జునరావు, ప్రభాకరరావు, ఏలూరు బార్‌ అధ్యక్షుడు అబ్బినేని విజయ్‌కుమార్‌, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు కృష్ణారెడ్డి, జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ప్రభాకర్‌ పాల్గొన్నారు. 


170 మందికి ప్రశంసాపత్రాలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రజలకు అత్యుత్తమ సేవలందించిన ప్రభుత్వ ఉద్యోగులు 170 మందికి జిల్లా కలెక్టర్‌ రేవు ముత్యాలరాజు ప్రశంసాపత్రాలను అందజేశారు. 

వివిధ శాఖల అధికారులు : జిల్లా సప్లైయి ఆఫీసర్‌ ఎన్‌.సుబ్బరాజు, జిల్లా కోపరేటివ్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ ఎం.వెంకటర మణ, పే అండ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఎన్‌.నరేష్‌కుమార్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో కేవీ రామకృష్ణ, రెడ్‌క్రాస్‌ ఛైర్మన్‌ ఎం.జయప్ర కాష్‌, హైకోర్టు లైజన్‌ ఆఫీసర్‌ కె.రామ్‌ గోపాల్‌, తాడేపల్లిగూ డెం, నరసాపురం, పాలకొల్లు మున్సిపల్‌ కమిషనర్లు బి.బాల స్వామి, పీఎం సత్యవేణి, సీహెచ్‌ సత్యనారాయణ, సీఆర్‌ఆర్‌ కళాశాల ప్రెసిడెంట్‌ అల్లూరి ఇంద్రకుమార్‌, ఎక్సైజ్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ టి.మల్లికార్జునప్రసాద్‌, హౌసింగ్‌ ఈఈ ఎవి రామ రాజు, డీఈఈ ఇ.నరసింహారావు, ఏఈ సి.జయసింగ్‌, ఐసీడీ ఎస్‌ అంగన్‌వాడీ వర్కర్లు కె.శ్రీదేవి, టి.సుగుణకుమారి, సీ హెచ్‌ నాగదుర్గ, ఐ.నిర్మల, ఇరిగేషన్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ కె.సంకు రమ్మ అసిస్టెంట్‌ ఈఈ ఎం.అనిల్‌బాబు, ఐటీ డీఏ నుంచి ఎపీవో సిహెచ్‌ శ్రీనివాసరావు, సీనియర్‌ అసిస్టెంట్‌ కె.బాల కృష్ణ, జూనియర్‌ అసిస్టెంట్‌ కె.వెంకట్రామయ్య, సమాచార శాఖ వి.వెంకటలక్ష్మి, ఆర్‌.మల్లిబాబు.

విద్యా శాఖ నుంచి : డీఇవో సూపరింటెండెంట్‌ ఎన్‌విఎన్‌కె తిరుపతిరాజు, ఎంఈవోలు వైబి మాణిక్యా లరావు, జె.సురేష్‌బాబు, ఎం.రంగరాజు, జి.శ్రీనివాస రావు, బి,హైమావతి, ఏఎస్‌వో ఎండి అక్బర్‌, ఏపీవో ఎ.ప్రభు, 

వ్యవసాయ శాఖ : భీమడోలు, తాడేపల్లిగూడెం ఏడీ లు కెజెడీ రాజన్‌, పీ.మురళీకృష్ణ, ఉంగుటూరు, గోపాలపురం ఏవోలు బి.వెంకటేష్‌, బి.రాజారావు, విలేజ్‌ అసిస్టెంట్‌ బి.గాయత్రి

బ్యాంకింగ్‌ రంగం : అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌ కెఎన్‌వి వెంకటేశ్వరరావు, సీనియర్‌ ఆడిటర్లు బీవీ సోమేశ్వరరావు, యు శరత్‌బాబు చైతన్య గ్రామీణ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఎం.బా లాజీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా సీనియర్‌ బ్రాంచ్‌ మేనేజర్‌ ఎన్‌.సు రేష్‌కుమార్‌, యూనియన్‌ బ్యాంక్‌ బ్రాంచ్‌ మేనేజర్‌  ఎం.శ్రీదేవి, యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ హెడ్‌ ఎం.సీతారామారావు, డీఎం సీఎస్‌ అకౌంటెంట్‌ ఎన్‌.వెంకట్రావు, యుబీఐ మేనేజర్‌ టీ.హను మంతరావు, ఎస్‌బీఐ జి.శోభన్‌కుమార్‌ మేనేజర్‌, కెనరాబ్యాంకు మేనేజర్‌ పీవీబీబీ మూర్తి, బిఓబి మేనేజర్‌, ఆర్‌.రమేష్‌బాబు. 

డీఎంసీఎస్‌ మేనేజర్‌ ఎల్‌.శ్రీనివాసరాజు, స్టేట్‌ ట్యాక్స్‌ డిప్యూ టీ కమీషనర్‌ డాక్టర్‌ ఏబీ హర్షవర్ధన్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ డీ మోహనరావు, కో ఆపరేటివ్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ వి.కన్యాకుమారి, జూనియర్‌ అసిస్టెంట్‌ కె లీలా శ్రీ, 

కలెక్టరేట్‌.. రెవెన్యూ శాఖ : కలెక్టరేట్‌ సూపరింటెండెం ట్లు బి.హేమకుమారి, బి.రమాదేవి, డిప్యూటీ తహసీల్దార్లు ఎం డీ నజీముల్లాషా,  సతీష్‌, సీనియర్‌ అసిస్టెంట్లు ఎస్‌.రాధా కృష్ణ, వీవీ రమణారావు, రాజ్‌కుమార్‌, 

ఏలూరు, పెదవేగి, ఉంగుటూరు, పోడూరు, ఉండి, చాగల్లు, పెనుమంట్ర తహశీల్దార్లు బీ.సోమేశ్వరరావు, వై.అప్పారావు, ఎన్‌.కిరణ్మ యి, పి.ప్రతాపరెడ్డి, ఎ.కృష్ణజ్యోతి, ఎం.శ్రీనివాసరావు, వై.దుర్గాకిషోర్‌, కెఆర్‌ఆర్‌సీ డిప్యూటీ తహసిల్దార్‌ పి నజీమా బేగం,  సీనియర్‌ అసిస్టెంట్‌ ఎవీ నాగేశ్వరరావు, ఎఎస్‌వో ఎం.రవిశంకర్‌, డిప్యూటీ తహ సిల్దార్‌ షేక్‌ మహ్మద్‌లాల్‌ అహ్మద్‌, ఏఎస్‌వో సరోజ, డీఏవో బి.పోతన, వీఆర్‌వోలు బి.నాగతులసీ, కె.శ్రీనివాస్‌, సిహెచ్‌ వెంకటేశ్వరరావు, పీవీబీఎల్‌ పద్మావతి, దుర్గాప్రసాద్‌, కె.ప్రభా కర్‌, గోపాలపురం ఆర్‌ఐ ఎస్‌బీవీ హరీష్‌, జంగారెడ్డిగూడెం ఆర్డీవో కార్యాలయం ఏవో ఎన్‌.శ్రీని వాసరావు, కొయ్యల గూడెం సర్వేయర్‌ కోదండరాముడు, జంగారెడ్డిగూడెం డిప్యూటీ సర్వేయర్‌ ఎం.తులసీ

పోలీసు శాఖ : గణపవరం సీఐ బీ.భగవాన్‌ ప్రసాద్‌, ఎస్‌ఐలు జి.వెంకటేశ్వరరావు, ఎస్‌.ముత్యాలరావు, ఎ.పైడిబా బు, జీజే విష్ణువర్ధన్‌, ఏఎస్‌ఐ ఎన్‌వి సత్యనారాయణ, హెడ్‌ కానిస్టేబుళ్లు కె.నాగరాజు, బి.రత్నారావు, కానిస్టేబుళ్లు కె.నాగ రాజు, బి.బాలాజీ, అఫ్సారీబేగ్‌, కె.రాము, పి.గంగాధరరావు, ఎస్‌కే ఖరీమ్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఎల్‌ఎన్‌ఆర్‌ కుమారి, 

ఆర్టీసీ : తణుకు డిపో మేనేజర్‌ షేక్‌ షబ్మమ్‌, ఏఎం వై సురేష్‌, డ్రైవర్‌ ఎం.పార్ధసారధిరావు, లీడింగ్‌ హెడ్‌ పీవీ రావు, ఏఏవో నాగార్జునరావు.

వివిధ విభాగాల నుంచి..: ఏలూరు, తాడేపల్లిగూడెం సబ్‌ రిజిస్ర్టార్లు ఎ.ధనలక్ష్మి, జెరత్నకుమార్‌, విజిలెన్స్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ పి.రాధాకృష్ణ, ట్రెజరీ అండ్‌ అకౌంట్స్‌ సీనియర్‌ అకౌంటెంట్‌ పీఎస్‌ఎస్‌ ప్రసాదబాబు, 

సోషల్‌ వెల్ఫేర్‌ సూపరింటెండెంట్‌ పీటీ దొర, ఎస్‌టీవో పి.పద్మజ, 

రీజనల్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌ సీహెచ్‌ రవికుమార్‌, వాటర్‌ రిసోర్స్‌ డిపార్ట్‌మెంట్‌ అసిస్టెంట్‌ ఈఈ పి.నాగమల్లేశ్వరి, సూపరింటెండెంట్‌ కె.భారతీదేవి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఎం.గంగాభవానీ, జైళ్ళ శాఖ సీనియర్‌ అసిస్టెంట్‌ ఎం ఆర్‌ఎస్‌ఎన్‌ శైలేశ్వర్‌, వార్డర్‌ ఎస్‌ఎన్‌ వెంకటేశ్వరరావు, 

తాడేపల్లిగూడెం, తణుకు అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్లు ఆకన లక్ష్మీ, ఎం.కిరణ్‌కుమార్‌, మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్‌  బి.సుజాత, ఎస్‌.కల్యాణి, ఎంజెసిహెచ్‌ ధర్మాజ్ఞ, పే అండ్‌ అకౌంట్స్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ బి.పావనకుమార్‌, ఎండీ మీయాజ్‌ అహ్మద్‌ గులామ్‌ఆర్‌అండ్‌బీ టెక్నికల్‌ ఆఫీసర్‌ బి.సీతారామరాజు, జూనియర్‌ అసిస్టెంట్‌ సతీష్‌కుమార్‌,  మజ్దూర్‌ టీ తాతేశ్వరరావు, టైపిస్టు వి.మహేశ్వరి, 

తాడేపల్లి గూడెం మున్సిపాల్టీ ఆర్‌ఐ బాలమురళీకృష్ణ, వీ ఆర్వో చలమల రాజేష్‌, కొవిడ్‌ సెంటర్‌ డిప్యూటీ ఎస్‌వో శివాజీ, కొవ్వూరు స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ కె.సత్యానందం, డ్రైవర్‌ ఐ.ఉమామహేశ్వరరావు, వేలేరుపాడు ఎగ్జిక్యూటివ్‌ ఈవో ఎం.శ్రీహరి, తాడేపల్లిగూడెం పంచాయతీ సెక్రటరీ టి.రవి చంద్ర, డీఆర్‌డీఎ ఎపీవో సీహెచ్‌ వెంకటఅప్పారావు, జి.ల క్ష్మణకుమార్‌, డ్వామా ఏపీడీ పీ కుమారస్వామి రాజా.








Updated Date - 2021-01-27T05:26:09+05:30 IST