కళాకారులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2021-04-17T05:23:22+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక నాటక పరిషత్‌ సమాఖ్య అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు కోరారు.

కళాకారులకు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
రాయప్రోలు భగవాన్‌ను సత్కరిస్తున్న నాటక పరిషత్‌ సమాఖ్య సభ్యులు

ఏపీ సాంస్కృతిక నాటక పరిషత్‌ అధ్యక్షుడు బుద్దాల 

 భీమవరంలో జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభం

భీమవరంటౌన్‌, ఏప్రిల్‌ 16 : రాష్ట్ర ప్రభుత్వం కళాకారులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక నాటక పరిషత్‌ సమాఖ్య అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు కోరారు. కళారంజని దశమ వార్షికోత్సవం సందర్భంగా గును పూడిలోని సోమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం వద్ద జరిగిన జాతీయ స్థాయి తెలుగునాటిక పోటీల ప్రారంభోత్సవ సభలో ఆయన మాట్లాడారు. కరోనా కాలంలోనూ ప్రభుత్వం కళాకారులకు ఎటువంటి సాయం అందించలేదన్నారు. తక్షణం కళాకారులకు రూ. 10 వేల సాయం అందించి ఆదుకోవాలన్నారు.  కళాకారులకు నాటక కార్పోరేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. చైతన్య భారతి సంగీత నృత్య నాటక పరిషత్‌ అధ్యక్షుడు రాయప్రోలు భగ వాన్‌కు సాంస్కృతిక పోషక యశోభూషణ బిరుదు ప్రదానోత్సవం చేశారు.  మాహానటి సావిత్రి పురస్కారాన్ని విజయనగరానికి చెందిన సాలూరి జ్యోతి రాణికి అందజేసి ఘనంగా సత్కరించారు. అనంతరం నాటిక పోటీలు ప్రారం భమయ్యాయి. మొదటిగా నటీనట సమాఖ్య పాలకొల్లు వారిచే నాన్నా– నన్ను క్షమించకండి నాటికను ప్రదర్శించారు. తరువాత కళాంజలి హైదరాబాద్‌ వారిచే కులక్షేత్రం నాటికను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో కళారంజని వ్యవస్థాపక అధ్యక్షుడు జవ్వాది దాశరఽథి శ్రీనివాస్‌, కార్యదర్శి మెంటే పూర్ణ చంద్రరావు, ప్రముఖ ఆడిటర్‌ రాయప్రోలు భగవాన్‌, నాటక కళా పరిషత్‌ అధ్యక్షుడు చవ్వాకుల సత్యనారా యణ, గుండా రామకృష్ణ, మానా పురం సత్య నారాయణ, చుక్కన శ్రీ, రాయప్రోలు శ్రీనివాసమూర్తి, మురళీ,గొన్నాబత్తుల మల్లేశ్వర రావు, పులగం నాగ నరసింహారావు, ఎం.సీతారామ్‌ ప్రసాద్‌, కాగిత వెంకట రమణ,  వైవీ.రమణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-17T05:23:22+05:30 IST