మృతదేహానికి రూ.35 వేలా..?

ABN , First Publish Date - 2021-05-11T05:46:52+05:30 IST

‘కరోనా బాధితుడు మృతి చెం దాడా ? కరోనా తీవ్రత ఎంత ? తీవ్రతను బట్టి దహనానికి ధర ఉంటుంది. మేం చెప్పిన రేటు ఇవ్వకపోతే మృతదేహాన్ని తీసుకుపొండి.

మృతదేహానికి రూ.35 వేలా..?

భీమవరంలో శవ దహనానికి వసూళ్లు

కరోనా తీవ్రతను బట్టి ధర రెట్టింపు

భీమవరం క్రైం, మే 10 : ‘కరోనా బాధితుడు మృతి చెం దాడా ? కరోనా తీవ్రత ఎంత ? తీవ్రతను బట్టి దహనానికి ధర ఉంటుంది. మేం చెప్పిన రేటు ఇవ్వకపోతే మృతదేహాన్ని తీసుకుపొండి. అసలు ఈ మృతదేహాలను దహనం చేయడ మే గొప్ప విషయం’ ఇదీ భీమవరంలోని శ్మశాన వాటికలోని కాటికాపర్ల తీరు. ఓ వైపు మనిషి ప్రాణం పోయి శోక సం ద్రంలో వున్న వారికి కాటి కాపర్లు చెప్పిన విషయాలు విం టుంటే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా సోకి పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి పరిస్థి తుల్లో వారిని చూసేందుకు వీలులేని పరిస్థితి. పోని ఇంటికి తీసుకుని వెళదామంటే బంధుమిత్రులు, స్థానికులు ఇబ్బంది పెడతారేమోనని ఆలోచన. పోనీ ఇక్కడే దహనం చేసి వెళ దామంటే వేలకు వేలు సమర్పించాల్సిందే. భీమవరంలో మరీ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ ప్రభుత్వాసుపత్రిలో 50 బెడ్లు ఉన్నాయి. ఆక్సిజన్‌ అందుబాటులో ఉంది. నిత్యం సీరియస్‌ కండీషన్‌లోవున్న నలుగురైదుగురు మృత్యువాత పడుతున్నారు. ఇలా మృతదేహం బయటకు వచ్చిందా? ఇక బంధువులకు చుక్కలు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి శ్మశాన వాటికకు తీసుకువెళ్లాలి. అంటే ఐదు వేలు పైమాటే. శ్మశాన వాటికలో దహనానికి రూ.35 నుంచి రూ.40 వేల వరకు చెల్లించాలి. కరోనా తీవ్రత ఉంటే రూ.50 వేలు అడుగుతున్నా రు. ఎవరైనా అంత చెల్లించలేకుంటే మృతదేహాన్ని తీసుకుని వెళ్లిపోండి. అని చెబుతున్నారని అంటున్నారు. దీంతో మృతదేహాన్ని తీసుకు వెళ్లలేని పరిస్థితి అలాగని డబ్బులు చెల్లించలేని పరిస్థితి. దీంతో అప్పు చేసైనా సరే మృతదేహానికి దహన కార్యక్రమాలు చేయించుకుంటున్నారు. అంబులెన్స్‌లు కూడా 2 కి.మీ. ప్రయాణానికి రూ.5 వేలు తీసుకుంటున్నారంటే దళారులు ఏ విధంగా సొమ్ము చేసుకుంటున్నారో అర్థం అవుతుం ది. ఇప్పటికైనా అధికారులు దళారులు ఆగడాలను అరికట్టాలని పేదలను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. 


Updated Date - 2021-05-11T05:46:52+05:30 IST