పనిచేయని బయోమెట్రిక్‌

ABN , First Publish Date - 2021-03-08T04:17:55+05:30 IST

మండలంలోని వివిధ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతు న్నారు.

పనిచేయని బయోమెట్రిక్‌

ఉంగుటూరులో 8 పాఠశాలలకు డీఈవో షోకాజ్‌

ఉంగుటూరు, మార్చి 7 : మండలంలోని వివిధ పాఠశాలల్లో బయోమెట్రిక్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతు న్నారు. హాజరు సక్రమంగా నమోదు కాకపోవడంతో ఉపాధ్యాయులు, విద్యా ర్థులు బయోమెట్రిక్‌ యంత్రం వద్ద గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.ఈ నేపథ్యంలో మండలలోని పలు పాఠశాలల్లో సమ యపాలన, భోజన వివరాలను పంపలేక పోతున్నామని ప్రధానోపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. బయోమెట్రిక్‌ సమస్య కారణంగా ఉంగుటూరు మం డలంలోని 8 పాఠశాలలకు డీఈవో గత నెల 5వ తేదీన షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీనిపై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లబోదిబో మంటున్నారు. గత వారం రోజులుగా బయోమెట్రిక్‌ సమస్య ఎక్కువగా ఉం దని.. ఉన్నతాధికారులు పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. 


Updated Date - 2021-03-08T04:17:55+05:30 IST