ఉద్యోగులపై పోలీసుల నిఘా...అజ్ఞాతంలో ఉద్యోగ సంఘాల నేతలు

ABN , First Publish Date - 2022-02-03T14:00:58+05:30 IST

ఛలో విజయవాడ వెళ్ళే ఉద్యోగులపై జిల్లా పోలీసులు అడుగడుగునా నిఘా ఉంచారు.

ఉద్యోగులపై పోలీసుల నిఘా...అజ్ఞాతంలో ఉద్యోగ సంఘాల నేతలు

ఏలూరు: ఛలో విజయవాడ వెళ్ళే ఉద్యోగులపై జిల్లా పోలీసులు అడుగడుగునా నిఘా ఉంచారు. బస్టాండ్లు,  రైల్వే స్టేషన్లలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్వయంగా తనిఖీలు చేశారు. కలపర్రు టోల్‌గేటు వద్ద పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. బస్సులు,  వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానం వచ్చిన వారిని వెంటనే వెనక్కి పంపుతున్నారు. జిల్లాలో పలుచోట్ల ఉద్యోగ సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఏలూరులో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీని గృహనిర్బంధం చేశారు. పెదవేగి పోలీసు ట్రైనింగ్ స్కూల్‌లో 80 మంది ఉద్యోగులను నిర్బంధించారు. కాగా కొందరు ఉద్యోగ సంఘాల నేతలు అజ్ఞాతంలో ఉండిపోయారు. సెల్‌ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. 


Updated Date - 2022-02-03T14:00:58+05:30 IST