పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలపై ఉత్కంఠ

ABN , First Publish Date - 2021-01-13T14:50:11+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. అనుమతుల కోసం పందాల నిర్వాహకులు ఎదురుచూపులు చూస్తున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలపై ఉత్కంఠ

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో కోడిపందాలపై ఉత్కంఠ కొనసాగుతోంది.  అనుమతుల కోసం పందాల నిర్వాహకులు ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల రహస్యంగా బరులు సిద్ధమయ్యాయి. ఏ క్షణమైనా అనుమతులు రావచ్చంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. పోలీసు అధికారులతో పందాల నిర్వాహకులు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతి కోసం ఉన్నత స్థాయి అధికారులతో  వైసీపీ నేతలు మంతనాలు చేపట్టారు. 

Updated Date - 2021-01-13T14:50:11+05:30 IST