Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప.గో.జిల్లా: పాఠశాలల్లో పెరుగుతున్న కరోనా కేసులు

పశ్చిమగోదావరి: జిల్లాలో పాఠశాలల్లో కరోనా కేసులు  పెరుగుతున్నాయి. వీరవాసరం మండలం, మత్స్యపురి జడ్పీ హైస్కూలులో ఇద్దరు, పెదపాడు మండలం, వట్లూరు జడ్పీ హైస్కూలులో ఒక విద్యార్థికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మిగిలిన ఉపాధ్యాయులు, విద్యార్థులకు వైద్య సిబ్బంది కరోనా పరీక్షలు నిర్వహించారు.


ఓవైపు కరోనా భయం.. మరోవైపు విద్యా సంవత్సరం వృథా అవుతుందేమోననే ఆందోళనల మధ్య తల్లిదండ్రులు తమ పిల్లలను బిక్కుబిక్కు మంటూనే బడులకు పంపుతున్నారు. ఉపాధ్యాయులు ఆందోళనలతో విద్యా బోధన చేస్తున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థుల హాజరు 85 శాతానికి చేరువైంది. మరోవైపు పాఠశాలల్లో ఒకటీ అరా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటిపై సర్వత్రా భయాందోళనలు నెలకొంటున్నాయి.  

Advertisement
Advertisement