పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పరస్పరం తలపడుతున్న ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులు!

ABN , First Publish Date - 2021-03-07T16:41:09+05:30 IST

పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది దశల్లో...

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో పరస్పరం తలపడుతున్న ఇద్దరు మాజీ ఐపీఎస్ అధికారులు!

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు ఇటు బీజేపీకి అటు టీఎంసీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపధ్యంలో ఇరు పార్టీలు గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించాయి. ముఖ్యంగా డోబ్రా సీటు నుంచి ఈ రెండు పార్టీలు మాజీ ఐపీఎస్ అధికారులను రంగంలోకి దించాయి.


ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు త‌ృణమూల్ కాంగ్రెస్ హుమాయూకు టిక్కెట్ కేటాయించగా, బీజేపీ భారతీ ఘోష్‌కు టిక్కెట్ కేటాయించింది. డోబ్రా... కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. డోబ్రా సీటు నుంచి టీఎంసీ తరపున పోటీకి దిగిన హుమాయూ కబీర్ ఇటీవలే రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేపీ తరపు పోటీ చేస్తున్న భారతీ ఘోష్ ఇంతకుముందు ఘాటల్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు.

Updated Date - 2021-03-07T16:41:09+05:30 IST