ఒమైక్రాన్ ఎఫెక్ట్.. పశ్చిమ బెంగాల్ మూత!

ABN , First Publish Date - 2022-01-02T21:41:43+05:30 IST

కరోనా నయా వేరియంట్ ఒమిక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే..

ఒమైక్రాన్ ఎఫెక్ట్.. పశ్చిమ బెంగాల్ మూత!

కోల్‌కతా: కరోనా నయా వేరియంట్ ఒమైక్రాన్ దేశంలో శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. జనం పెద్ద ఎత్తున గుమికూడడం, సభలు, సమావేశాలకు అనుమతి నిరాకరిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ కూడా అమలు చేస్తున్నాయి. ఈ విషయంలో పశ్చిమ బెంగాల్ మరో అడుగు ముందుకేసింది. దాదాపు లాక్‌డౌన్ తరహా ఆంక్షలను ప్రకటించింది. 


స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు, స్పాలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జూలు, వినోద పార్కులను రేపటి (జనవరి 3) నుంచి మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి హెచ్‌కే ద్వివేదీ ఆదేశాలు జారీ చేశారు.


ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం సామర్థ్యంతో మాత్రమే కార్యకలాపాలు కొనసాగించాలని స్పష్టం చేశారు. పాలనా పరమైన సమావేశాలను వర్చువల్‌గా నిర్వహించుకోవాలని సూచించారు. ఒమైక్రాన్ అణచివేతకు ఈ  స్థాయిలో ఆంక్షలు విధించిన రాష్ట్రం ప్రస్తుతానికి పశ్చిమ బెంగాల్ ఒకటే.

Updated Date - 2022-01-02T21:41:43+05:30 IST