మా బడి మాకు కావాలి

ABN , First Publish Date - 2022-07-07T05:11:54+05:30 IST

ఊరు నుంచి బడిని దూరం చేయ్యొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

మా బడి మాకు కావాలి
జిన్నూరు నరసింహారావుపేట పాఠశాల వద్ద తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేస్తున్న విద్యార్థులు..

పాఠశాలల విలీనంపై ఆందోళన
కొణితివాడ నరసన్న చెరువుపాలెం బడిగేటుకు తాళం వేసిన తల్లిదండ్రులు
 పోడూరు మండలంలోనూ నిరసనలు


వీరవాసరం/ పోడూరు జూలై 6 :  ఊరు నుంచి బడిని దూరం చేయ్యొద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. వీరవాసరం మండలంలోని కొణితివాడ నరసన్న చెరువుపాలెం ప్రాథమిక పాఠశాలను జడ్పీ హైస్కూల్‌లో విలీనం చేయడంపై ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాల తెరవకుండా ప్రధాన గేటుకు బుధవారం తాళం వేశారు. హెచ్‌ఎం అధికారులకు ఫిర్యాదు చేశారు. నరసన్నచెరువు ప్రాథమిక పాఠశాలలో 47 మంది విద్యార్థులు ఉన్నా రు. 3,4,5 తరగతులను ప్రాథమిక పాఠశాల నుంచి వేరుచేసి కొణితివాడ ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై  రెండునెలలుగా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌, విద్యార్థుల తల్లిదండ్రులు తమ ప్రాంత పాఠశాలను ఉన్నత పాఠశాలలో కలుపవ ద్దు అంటూ నిరసన తెలుపుతు న్నారు. మంగళవారం కలెక్టర్‌కు, తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవో కార్యాలయాల్లో  వినతిపత్రాలు ఇచ్చారు. అధికారుల నుంచి ఏ సమాధానం లేకపోవడంతో బుధవారం  పాఠశాలకు తాళం వేశారు. ఇది గ్రామంలోని రెండు వర్గాల మధ్య వివాదానికి దారితీసింది. మధ్యాహ్నానానికి విద్యార్థుల తల్లిదండ్రులు తాళం తీసినా విద్యార్థులను ఎవరినీ పాఠశాలకు పంపలేదు.
  పోడూరు మండలం వేడంగి శివారు కుమ్మరపాలెం ప్రాఽథమిక పాఠశాల 3,4,5 తరగతులకు చెందిన 19 మంది విద్యార్థులను కిలోమీటరు దూరంలోని జిన్నూరుపాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనం చేశారు. బుధవారం విద్యార్థులు, తల్లిదండ్రులు స్ధానిక ఆర్‌అండ్‌బీ రోడ్డుపై నిరసరకు దిగారు. పాలకొల్లు ఎమ్మెల్యే రామానాయుడు అక్కడకు చేరుకుని మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న పాఠశాలల విలీన విధానంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాద్యాయులు ఆందోళన చెందుతున్నారని, విలీన విధానానికి స్వస్తి పలకాల న్నారు. పీఎంసీ చైర్మన్‌ ఇళ్ల విశ్వనాథం, మండల టీడీపీ అధ్యక్షుడు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, తదితరులు పాల్గొన్నారు.   జిన్నూరు నరసింహరావు పేట ప్రాథమిక పాఠశాల వద్ద కూడా విద్యార్థులు, తల్లిదండ్రులు మాబడి మాకు కావాలంటూ బుధవారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టారు.  

Updated Date - 2022-07-07T05:11:54+05:30 IST