శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ పునరేకీకరణ జరిగేంత వరకూ, ఆర్టికల్ 370 పునరుద్ధరించే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రకటించారు. గతంలో దేశంలోని అన్ని రాష్ట్రాల విభజన కూడా ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే జరిగాయని పేర్కొన్నారు. పంజాబ్ ను మూడు రాష్ట్రాలుగా విభజించే సమయంలోనూ ప్రజల మద్దతు ఉండేదని, బిహార్ ను రెండు రాష్ట్రాలుగా విభజించే సమయంలో ప్రజలు మద్దతిచ్చారని గుర్తు చేశారు. వీటితో యూపీ, ఏపీ విభజన సమయాల్లోనే ప్రజలు మద్దతిచ్చారని ఒమర్ పేర్కొన్నారు. అయితే జమ్మూ కశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించిన సమయంలో మాత్రం నిర్బంధం విధించిన ప్రకటించారని, ఇలా ప్రకటించడం ఇదే ప్రథమమని మండిపడ్డారు. ఈ నిర్ణయానికి జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఆమోదం లేదని, సీఎం కూడా దీనిపై సంతకం చేయలేదన్నారు. ఈ నిర్ణయానికి తామెంత మాత్రం ఆమోదయోగ్యులుగా లేమని ఒమర్ తెలిపారు.