వెల్లివిరిసిన సేవాభావం

ABN , First Publish Date - 2020-04-18T09:42:47+05:30 IST

కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు.

వెల్లివిరిసిన సేవాభావం

పేదలను ఆదుకునేందుకు ముందుకు వస్తున్న దాతలు 

అన్నదానం, నిత్యావసరాల పంపిణీ


గుంటూరు, ఏప్రిల్‌ 17: కరోనా కష్టకాలంలో పేదలను ఆదుకునేందుకు పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు అన్నదానం, నిత్యావసరాలు వితరణ చేస్తున్నాయి. ఆర్‌వీఆర్‌ అండ్‌ జేసీ ఇంజనీరింగ్‌ కళాశాల సిబ్బంది రూ.7.37 లక్షలు.. శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కులు కోసం అందజేశారు. కళాశాల అధ్యక్షుడు డాక్టర్‌ రాయపాటి శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సుధాకర్‌ తదితరులు కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌కుమార్‌లను కలిసి ఈ మేరకు చెక్కును అందజేశారు. కార్యక్రమంలో సెక్రటరీ రాయపాటి గోపాలకృష్ణ, ట్రెజరర్‌ డాక్టర్‌ కొండబోలు కృష్ణ ప్రసాద్‌, జాగర్లమూడి మురళీమోహన్‌, డాక్టర్‌ మద్దినేని జగదీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు మండలంలో పంచాయతీ సిబ్బందికి డీపీవో దాసరి రాంబాబు హెల్త్‌కిట్లు అందించారు. గుంటూరులోని ఆటోవాలా కుటుంబాలకు ఎంపీ సుజనాచౌదరి సహకారంతో మాస్కులు అందజేసినట్లు బీజేపీ నేత దర్శనపు శ్రీనివాస్‌ తెలిపారు.


స్వర్ణభారతి నగర్‌ సెంట్‌ మేరీస్‌ పాఠశాల ప్రాంగణంలో కార్మిక కుటుంబాలకు ఏపీ బ్రాహ్మణ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆహారాన్ని అందజేశారు. స్వామి అయ్యప్ప సేవా సంఘం నిర్వాహకులు బచ్చు సాంబస్వామి, బిజినేపల్లి రాధల ఆధ్వర్యంలో వెయ్యి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. అసంఘటిత కార్మికులకు మలబార్‌ గోల్డ్‌, డైమండ్స్‌, ప్రజ్వల కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌ సొసైటీ సంస్థలు నిత్వాసరన సరుకులు పంపిణీ చేశాయి. గుంటూరులోని పునరావాస కేంద్రాల్లో నిరాశ్రయులకు స్వామి అయ్యప్పసేవా సంఘం ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ చేశారు. స్థానిక 35, 36, 39 డివిజన్ల టీడీపీ నేతలు ఆ పార్టీ నేత కోవెలమూడి రవీంద్ర నేతృత్వంలో  వెయ్యి పేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.


బీజేపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ జూపూడి రంగరాజు, డాక్టర్‌ శ్రీధర్‌, అమ్మిశెట్టి ఆంజనేయులు తదితరులు భవన నిర్మాణ కార్మికులకు మాస్కులు, ఆహారపొట్లాలు అందించారు. మున్సిపల్‌ కార్పొరేషన్‌ కాంట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ మాస్కులు, శానిటైజర్లు కమిషనర్‌ అనురాధకు అందించారు.  ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు) అమరావతి సోషల్‌ సర్వీసెస్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ ట్రస్టు, ప్రొఫెసర్‌ ఎంవీఎస్‌ కోటేశ్వరరావు మెమోరియల్‌ స్కూల్‌ ఆధ్వర్యంలో క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉన్న పేదలకు ఉపకరించే దుప్పట్లు, లుంగీలను గుంటూరు జిల్లా కలెక్టర్‌, జేసీలకు అందజేశారు.


గుంటూరుకు చెందిన హోమియో వైద్యులు డాక్టర్‌ ఓవీ రమణ తన వంతు సాయంగా రూ.లక్షా116 అర్బన్‌ పోలీసు అధికారి రామకృష్ణను కలిసి అందించారు. షిర్డిసాయి ఆధ్యాత్మిక సేవా సమితి అధ్యక్షుడు ఓరుగంటి విశ్వనాథం ఆధ్వర్యంలో శానిటైజర్లు, మాస్కులను పోలీసులకు పంపిణీ చేశారు. ముస్లిం మైనార్టీ నాయకుడు షేక్‌ జియావుర్‌రెహమాన్‌ ఆధ్వర్యంలో వినోబానగర్‌ ప్రాంతాల్లో పేదలకు గోధుమపిండి, రైస్‌ పంపిణీ చేశారు. యూత్‌ కాంగ్రెస్‌ తూర్పు నియోజ కవర్గ అధ్యక్షుడు సయ్యద్‌ జబీవుల్లా ఆధ్వర్యంలో  వలస కూలీలలకు నిత్యావ సర సరుకులను అందించారు. జన ప్రభంజనం సామాజిక సేవా సంస్థ ఆధ్వర్యంలో కృష్ణబాబు కాలనీలో కూరగాయలను పంపిణీ చేశారు.  డాక్టర్‌ సుధాలక్ష్మీ ఆధ్వర్యంలో హోమియో మందులను పంపిణీ చేశారు. 

Updated Date - 2020-04-18T09:42:47+05:30 IST