అలా నెట్టుకొస్తున్నారు

ABN , First Publish Date - 2020-06-01T10:06:34+05:30 IST

కింది స్థాయి అధికారులు జిల్లాస్థాయి అధికారులు గా బాధ్యతలు నిర్వహించాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా

అలా నెట్టుకొస్తున్నారు

జిల్లాలో చాలా శాఖలకు ఇన్‌చార్జి అధికారులే దిక్కు 

లబ్ధిదారులకు సక్రమంగా చేరని సంక్షేమ పథకాలు 

కుంటుపడుతున్న జిల్లా అభివృద్ధి 

మొదటి ఏడాది వరకు అన్ని శాఖలకు పూర్తిస్థాయి అధికారులు


ప్రజలకు పాలన చేరువచేయాలని ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో ప్రజలకు జిల్లా అధికారులు చేరువయ్యారు. కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లాలో మొదటి ఏడాది వరకు అన్ని శాఖలకు జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు. ప్రతి శాఖకు జిల్లా అధికారులు ఉండడంతో పాలన సాఫీ గా సాగింది. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా సకాలంలో చేరేవి. అభివృద్ధి కూడా వేగంగా జరిగింది. ఇటీవల జిల్లాలోని ప్రధాన శాఖలకు జిల్లా అధికారులు లేకుండా పోయారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కువ శాఖలకు అధికారులుగా ఇన్‌చార్జిలను నియ మించారు. దీంతో జిల్లాలో అభివృద్ధి కుంటుపడింది. సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందడంలేదు. మంత్రి, జిల్లా కలెక్టర్‌ వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించినప్పుడు పూర్తిస్థాయిలో నివేదికలు ఉండడంలేదు. 


(సూర్యాపేట,కలెక్టరేట్‌):  కింది స్థాయి అధికారులు జిల్లాస్థాయి అధికారులు గా బాధ్యతలు నిర్వహించాలంటే ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖలకు సంబంధించి అంతా ఇన్‌చార్జి అధికారులే హాజరవుతున్నారు. జిల్లాలో నెల కొన్న సమసలు, పలు శాఖల పనితీరుపై సమావేశం లో ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ప్రస్తుతం అనేక విభాగాలకు జిల్లాస్థా యి అధికారులు లేరు. కొంతమంది అధికారులు ఉద్యోగ విరమణ చేయగా, మరికొంత మంది బదిలీపై వెళ్లారు. కొందరు దీర్ఘకాలి క సెలవుల్లో ఉన్నారు.  


కీలక శాఖల్లో...

ముఖ్యంగా జిల్లాలో విద్యా శాఖకు డీఈవోగా, 23 మండలాలకు ఏంఈవోలుగా అంతా ఇన్‌చార్జలే పని చేస్తున్నారు. అదేవిధంగా పోలీస్‌శాఖలో పోలీసుల సం క్షేమ విభాగం, పరిపాలనను పరిరక్షించే అడిషనల్‌ ఎస్పీ పోస్టు కూడా ఏడాది కాలంగా ఖాళీగానే ఉంది. ఆ బాధ్యతలను జిల్లా ఎస్పీనే చూస్తున్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అదనంగా అడిషనల్‌ ఎస్పీ విధులను కూడా జిల్లా ఎస్పీనే చూడాల్సి వస్తుం ది. ప్రస్తుతం కరోనా వైరస్‌ నేపథ్యంలో డీఎంహెచ్‌వో పోస్టు చాలా ముఖ్యమైనది. డీఎంహెచ్‌వోగా ఉన్న సాంబశివరావు బదిలీ అయ్యారు. డీఎంహెచ్‌వోగా గతంలో పనిచేసిన డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ నిరంజన్‌కు ఇన్‌చార్జిగా బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశా రు.


ఇన్‌చార్జిగా డీఎంహెచ్‌వోగా డాక్టర్‌ నిరంజన్‌ మాత్రం బాధ్యతలు చేపట్టలేదు. దీంతో డీఎంహెచ్‌వో పోస్టు ఖాళీగానే ఉంది. వీటితో పాటు జిల్లా సమాచా ర పౌరసంబంధాల శాఖ అధికారి కూడా ఇంచార్జే వ్య వహరిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ బాధ్యతలను చూసే సివిల్‌ సప్లయ్‌ జిల్లా మేనేజర్‌ పోస్టులో కూడా కిందిస్థాయి అధికారి ఇం చార్జిగా కొనసాగుతున్నారు. జిల్లా మార్కెటింగ్‌ అధికారి పోస్టు లో కూడా ఆ శాఖలోని ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ ఇన్‌చా ర్జిగా వ్యవహరిస్తున్నారు. భూగర్భజల అధికారి, వెనుకబడిన,గిరిజన తరగతుల అభివృద్ధి అధికారులు కూడా ఇంచార్జిలే కొనసాగుతున్నారు. వీరితో పాటు జిల్లా ట్రెజరీ అధికారి, పంచాయతీరాజ్‌ ఈఈ పోస్టుల్లో కూ డా ఇన్‌చార్జిలే బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా మై నింగ్‌ శాఖ ఏడీ కూడా ఇన్‌చార్జి అధికారే ఉన్నారు. ఆ అధికారి కూడా ఉద్యోగ విరమణ పొందారు. డీఎస్‌వో విజయలక్ష్మి ఇటీవల దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నారు. ఆ బాధ్యతలను కూడా ఏఎస్‌వోకు అప్పగించారు. ఇన్‌చార్జి పోస్టుతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కింది స్థాయి అధికారి ఒకరు వాఖ్యానించారు. జిల్లాస్థాయి అధికారి లేకపోవడం వల్ల తమ రోజు వారివిధులతో పాటు జిల్లా స్థాయి బాధ్యతలు చూడాలంటే భారంగా ఉందని పేర్కొన్నారు. 


త్వరలో పదవులు భర్తీ అవుతాయి

జిల్లాలో చాలా జిల్లా స్థాయి పోస్టుల్లో ఇంచార్జిలే విధులు నిర్వహిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చాం. ఈ నెలలో జిల్లాస్థాయి అధికారుల నియామకం జరిగే అవకాశం ఉంది.  

- వినయ్‌కృష్ణారెడ్డి, కలెక్టర్‌, సూర్యాపేట జిల్లా

Updated Date - 2020-06-01T10:06:34+05:30 IST