Abn logo
Jul 30 2021 @ 22:36PM

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు అందజేస్తున్న ఎమ్మెల్యే

నెన్నెల, జూలై 30: ప్రభుత్వం అమలు చేస్తున్న సం క్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని  ఎమ్మె ల్యే దుర్గం చిన్నయ్య కోరారు. దేశంలో ఎక్కడ కూడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వ హించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు పేదల ఇళ్లల్లో ఆనందాలు నింపుతున్నాయన్నారు.  ఎంపీపీ సంతోషం రమాప్రతాప్‌రెడ్డి, జడ్పీటీసీ సిం గతి శ్యామలారాంచందర్‌, ఆర్డీవో శ్యామలాదేవి, పీఏసీ ఎస్‌ చైర్మన్‌ మేకల మల్లేష్‌, ఆత్మ చైర్మన్‌ రాజు,  తహ సీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

తాండూర్‌: అర్హులందరికీ రేషన్‌ కార్డులు అంద జేస్తామని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.  తహ సీల్దార్‌ కార్యాలయంలో 210 కొత్త రేషన్‌కార్డులతో పాటు, 43 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీము బారక్‌ చెక్కులను అందజేశారు. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి కార్డులు అందేలా చూస్తామని తెలి పారు. ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్‌, జడ్పీటీసీ  బానయ్య, ఎమ్మార్వో కవిత పాల్గొన్నారు. 

కన్నెపల్లి: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయ మని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. మం డల కేంద్రంలో రైతువేదికలో రేషన్‌ కార్డులు, కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యారు.    120 మందికి  రేషన్‌కార్డులు, 18 మందికి కల్యాణలక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. జడ్పీటీసీ సత్యనారాయణ, ఎంపీపీ సృజన, తహసీల్దార్‌ రాంచందర్‌, ఎంపీడీవో శంకరమ్మ, వైస్‌ ఎంపీపీ రాకేష్‌శర్మ పాల్గొన్నారు.