సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీపీ సుజాతమ్మ
ఎంపీపీ సుజాతమ్మ
దొరవారిసత్రం, జనవరి 21 : అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను అందించాలని ఎంపీపీ దువ్వూరు సుజాతమ్మ కోరారు. శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ఆమె శాఖల వారీగా సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న వరిపంటలపై రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వానికి నివేదికలు పంపాలని ఏవో కాంచనకు సూచించారు. సమావేశంలో ఎంపీడీవో సింగయ్య, జడ్పీటీసీ రమేష్, వైఎస్‌ఎంపీపీ దువ్వూరు గోపాల్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు, కార్యదర్శులు, సర్పంచిలు, అధికారులు పాల్గొన్నారు.