అర్హులందరికీ సంక్షేమ పథకాలు

ABN , First Publish Date - 2022-05-21T06:40:37+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదిస్తే ప్రజలకు కొత్త పథకాలు అందించి ఆదుకుంటారని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ అన్నారు. నాతవరం మండలంలోని గునుపూడిలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్య టించి, సమస్యలు తెలుసు కున్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాలు
గునుపూడి గ్రామంలో మోహరించిన పోలీసులు

   ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో ఎమ్మెల్యే గణేశ్‌ వెల్లడి

 గునుపూడిలో వైసీపీ జెండా ఆవిష్కరణపై టీడీపీశ్రేణుల  అభ్యంతరం

  భారీగా మోహరించిన పోలీసులు అక్కడి నుంచి వెళ్లాలని సూచన 

నాతవరం, మే 20 : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని మరోసారి ఆశీర్వదిస్తే ప్రజలకు కొత్త పథకాలు అందించి ఆదుకుంటారని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ అన్నారు. నాతవరం మండలంలోని గునుపూడిలో శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పర్య టించి,  సమస్యలు తెలుసు కున్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా.. అని అక్కడివారిని ప్రశ్నించారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, వైస్‌ ఎంపీపీలు పైల సునీల్‌, మైనం నాగగోపీ, గన్నవరం పీఏసీఎస్‌ అధ్యక్షుడు గొర్లి వరహలబాబు, గునుపూడి సర్పంచ్‌ వేముల సూర్యనారాయణ, ఎంపీటీసీ పోలుపర్తి వెంకటరమణ, మాజీ సర్పంచ్‌ పోలుపర్తి చిట్టబ్బాయి లింగంపేట సర్పంచ్‌ లోకవరపు రాము తదితరులు పాల్గొన్నారు. 

ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పి వైసీపీ జెండా ఎగరవేయడమా?

గునుపూడిలో వైసీపీ నాయకులు దిమ్మ ఏర్పాటు చేసి, పార్టీ జెండాను ఎమ్మెల్యే గణేశ్‌తో ఆవిష్కరించడంపై టీడీపీ శ్రేణులు అభ్యంతరం తెలి పారు. ‘గడప గడపకు మన ప్రభు త్వం’ అనేది  ప్రభుత్వ కార్యక్రమం అని చెప్పి, పార్టీ జెండా ఎగరవే యడం ఏమిటని  కార్యకర్తలు సాయి తదితరులు ప్రశ్నించారు. గ్రామంలో మోహరించిన పోలీసులు టీడీపీ శ్రేణులను ఇక్కడి నుంచి వెళ్లిపోవా లని సూచించారు. దీంతో వారు మాట్లాడుతూ తాము గోడవ కోసం రాలేదని.. ప్రభుత్వ కార్యక్రమంలో అందునా గుడి దగ్గర వైసీపీ జెండా ఏర్పాటు ఏమిటని ప్రశ్నించేందుకే వచ్చామని చెప్పి  పోలీసులతో కాసేపు వాగ్వాదానికి దాగారు. 

Updated Date - 2022-05-21T06:40:37+05:30 IST