సైనికుల భార్యల సంక్షేమ సారథి

ABN , First Publish Date - 2021-12-09T08:18:51+05:30 IST

త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ భార్య మధులిక రావత్‌ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్‌. ఆమె తండ్రి దివంగత రాజకీయ నాయకుడు మ్రిగేంద్ర సింగ్‌. ఆ

సైనికుల భార్యల సంక్షేమ సారథి

  • సైకాలజీలో గ్రాడ్యుయేట్‌ మధులిక రావత్‌
  • దివ్యాంగ చిన్నారుల కోసమూ సేవా కార్యక్రమాలు


న్యూఢిల్లీ, డిసెంబరు 8: త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌ భార్య మధులిక రావత్‌ స్వస్థలం మధ్యప్రదేశ్‌లోని షాహ్డోల్‌. ఆమె తండ్రి దివంగత రాజకీయ నాయకుడు మ్రిగేంద్ర సింగ్‌. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో గ్రాడ్యుయేషన్‌ చేశారు. సైనిక ఉద్యోగుల భార్యల సంక్షేమ సంఘం(ఏడబ్ల్యూడబ్ల్యూఏ)కు ఆమె అధ్యక్షురాలు. సైనిక ఉద్యోగుల భార్యలు, పిల్లలు, వారిపై ఆధారపడిన ఇతర కుటుంబసభ్యుల సంక్షేమం కోసం ఏడబ్ల్యూడబ్ల్యూఏ కృషి చేస్తుంది. మరణించిన సైనికుల భార్యలు, వారి దివ్యాంగ చిన్నారుల సాయం కోసం అనేక సంక్షేమ, ప్రచార కార్యక్రమాలనూ మధులిక నిర్వహించారు. దీంతోపాటు ముఖ్యంగా కేన్సర్‌ బాధితుల కోసం అనేక సామాజిక సేవా కార్యక్రమాలనూ ఆమె నిర్వహించారు. టైలరింగ్‌, అల్లికలు, బ్యాగుల తయారీ, కేకులు, చాక్లెట్ల తయారీ, బ్యూటీషియన్‌ కోర్సులు చేయడం ద్వారా స్వయంప్రతిపత్తి సాధించేలా వారిని ప్రోత్సహించేవారు. 

Updated Date - 2021-12-09T08:18:51+05:30 IST